నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా?.. మహిళల్లో అందుకు కారణం ఇదే !

by Javid Pasha |
నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా?.. మహిళల్లో అందుకు కారణం ఇదే !
X

దిశ, ఫీచర్స్: పొద్దస్తమానం పనిలో నిమగ్నమై అలసి పోతారు. రాత్రికి ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటారు. కానీ ఎంతకీ నిద్రపట్టదు. ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఇటువంటి నిద్రలేమి సమస్యలు ఈ మధ్య అధికం అవుతున్నాయి. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. వాస్తవానికి నిద్ర అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు. కొందరు బెడ్‌పై లేదా నేలపై ఇలా వాలగానే అలా నిద్రపోతుంటారు. మరికొందరు నిద్రలోకి జారుకోవడానికి అవస్థలు పడుతుంటారు. ఇందుకు ఆరోగ్యపరమైన కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (PMS), ప్రీమెన్‌స్ట్రువల్ డిస్పోరిక్ డిజార్డర్ (PMDD) వంటి రుతుక్రమ పరిస్థితులవల్ల మహిళల్లో నిద్రలేమి సమస్యలు, స్లీప్ డిజార్డర్స్ వంటివి తలెత్తుతుంటాయి. దీంతో రాత్రిపూట కంటిమీద కునుకు కరువవుతుంది.

బాధితులు పీరియడ్ టైంలో నిద్రపోయేందుకు ఇబ్బంది పడటమే కాకుండా ఎక్కువగా స్ట్రెస్‌కు గురవుతుంటారు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలోనూ కొందరికి నిద్రపట్టదు. కాళ్లు తిమ్మిరి పట్టడం, ఎక్కువసార్లు యూరిన్‌కు వెళ్లాల్సి రావడం కూడా ఇందుకు కొంత కారణం అవుతుంటాయి. మరో కారణం ఏంటంటే.. పెరిమెనోపాజ్ దశ.. ఈ స్టేజ్‌లో ఉన్న స్త్రీలకు సరిగ్గా నిద్రపట్టని పరిస్థితులు తరచూ తలెత్తుతుంటాయి. రాత్రిపూట శరీరం చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక గర్భవతులైన మహిళలకు కూడా ప్రసవానంతరం నిద్రపట్టని పరిస్థితులు ఎదురవుతుంటాయి. పిల్లల ఏడుపు, శారీరకంగా వచ్చే మార్పులు, హార్మోన్ల అసమతుల్యత ఇందుకు కారణం కావచ్చు. అయితే ఈ సమస్యలన్నీ కొంతకాలానికి సర్దుకుంటాయి. మరీ ఎక్కువకాలం నిద్రలేమి సమస్య కొనసాగుతుంటే గనుక బాధితులు తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


Advertisement

Next Story