- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్మర్‌లో శక్తికి మించిన వ్యాయామాలతో నష్టం.. ఏం జరుగుతుందంటే..
దిశ, ఫీచర్స్ : వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ, సమ్మర్‌లో ఎక్కువసేపు వ్యాయామాలు చేయడం మాత్రం అనర్థదాయకం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వేసవిలో కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మిగతా సీజన్లతో పోల్చినప్పుడు సమ్మర్‌లో బయటి ఉష్ణోగ్రతలు, బాడీ టెంపరేచర్ అధికంగా ఉంటాయి. హెచ్చు తగ్గులకు గురవుతుంటాయి. వర్కవుట్స్ చేసే క్రమంలో పలు మార్పులు సంభవిస్తాయి. అందుకే శక్తిమించి లేదా ఓవర్ టైమ్ వర్కవుట్స్ చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువసేపు వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు తమ సమయాన్ని తగ్గించుకుంటే బెటర్ అంటున్నారు.
వేసవిలో ఫిట్‌నెస్ కోసం శక్తికి మించి వ్యాయామాలు చేయడంవల్ల శరీరం నుంచి చెమట అధికంగా బయటకు పోతుంది. ముఖ్యంగా నీటి శాతంతోపాటు సోడియం లెవల్స్ త్వరగా తగ్గే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా కళ్లు తిరగడం, చూపుల్లో తేడాగా అనిపించడం, తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు. యూఎస్ డిపార్టెమెంట్ ఆఫఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం అధిక ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. అందుకే మిగతా సీజన్ల మాదిరి కాకుండా వేసవిలో వర్కవుట్స్ టైం టేబుల్ మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక డైలీ వర్కవుట్స్ టైమ్ తగ్గించడంతోపాటు ఉదయం ఏడు లోప పూర్తి చేయడం బెటర్.