- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తదానం చేస్తే ఏం జరుగుతుంది?.. ఎవరికి లాభం?
దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగినంత బ్లడ్ లెవల్స్ ఉండాలి. వివిధ వ్యాధుల బారినుంచి మనల్ని మనం కాపాడుకోవడంలోనూ రక్తం కీలపాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం, రక్తహీనత ఏర్పడటం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేది బ్లడ్ మాత్రమే. అందుకే రక్త దానం ప్రాణ దానంతో సమానమని అంటుంటారు నిపుణులు. అయితే రక్తం ఎవరికి అవసరం? బ్లడ్ డొనేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది తదితర విషయాలు తెలుసుకుందాం.
అపోహలు వద్దు
ప్రతీ సంవత్సరం మనదేశంలో సుమారు 4 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 25 శాతం మంది పురుషులు, 57 శాతం మంది మహిళలు, 67 శాతం మంది పిల్లలు, 52 శాతం మంది గర్భవతులు రక్తహీనతతో బాధపడున్నారు. దాదాపు లక్షన్నర మంది ప్రమాదాల్లో గాయపడి చనిపోతున్నారు. గాయపడినప్పుడు అధిక రక్త స్రావం కావడంవల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి పోవాలంటే వ్యక్తులుగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో ముఖ్యమైంది రక్త దానం చేయడం. కొందరు తమ శరీరం బలహీన పడుతుందని బ్లడ్ డొనేట్ చేయడానికి వెనుకాడుతుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. బ్లడ్ డొనేషన్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కొత్త రక్తం ఏర్పడుతుంది
బ్లడ్ డొనేషన్ వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు. రక్తం ఇచ్చినవారి శరీరం బలహీన పడుతుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. పైగా రక్త దానం చేయడంవల్ల పాత రక్తకణాలు పోయి, కొత్త రక్తకణాలు ఏర్పడతాయి. దీనివల్ల శరీరంలో సహజంగానే కొత్త రక్తం ప్రొడ్యూస్ అవుతుంది.
ఐరన్ లెవల్స్ మెరుగు పడతాయి
బాడీలో ఐరన్ లెవల్స్ అధికమైతే రక్తనాళాల్లో ఆటంకానికి దారితీయవచ్చు. ఇతర అనారోగ్యాలు కూడా ఏర్పడవచ్చు. అయితే రక్త దానం చేసేవారిలో ఈ సమస్య ఉండదు. పైగా ఐరన్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
బ్లడ్ డొనేట్ చేసినప్పుడు శరీరంలో కొత్త ప్లాస్మా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియవల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వివిధ రకాల జబ్బులు, రోగాలు, అంటు వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా రక్తదానంవల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది.
అధిక బరువు తగ్గుతారు
రక్తదానంవల్ల దాతల్లో కొత్త రక్తం ఏర్పడటం, వివిధ వ్యాధుల రిస్క్ తగ్గడం, ఇమ్యూనిటీ పవర్ పెరగడం వంటి బెనిఫిట్స్‌తో పాటు అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చునని శాన్ డియాగో యూనివర్సిటీ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ వల్ల బాడీలో 600 నుంచి 650 కేలరీలు బర్న్ అవుతాయట.
ఎవరు చేయకూడదు?
అప్పటికే వ్యాధులు, రక్తహీనతతో బాధపడేవారు, గర్భిణులు, ఈ మధ్యే శస్త్ర చికిత్స చేయించుకున్నవారు బ్లడ్ డొనేట్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు డాక్టర్లు నిర్ధార లేనిదే రక్త దానం చేయకూడదు. ఇక లైంగిక సంక్రమణ వ్యాధులన్నీ రక్త మార్పిడి ద్వారా వ్యాపిస్తాయి. కాబట్టి సిఫిలిస్, గొనోరియా, ఇతర లైంగిక వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయకూడదు. దీంతోపాటు యాంటీబాడీస్ డిసీజెస్ ఉన్నవారు, హిమోగ్లోబిన్ లోపాలు ఉన్నవారు, క్యాన్సర్ బాధితులు, ఇన్సులిన్ తీసుకుంటున్నవారు రక్తదానం చేయకూడదు. అయితే రక్తదానం చేసేవారు, అలాగే స్వీకరించే ముందుగా డాక్టర్లను సంప్రదించి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి.