- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జలుబు తక్కువైనా దగ్గు తగ్గడం లేదా.. ఊపిరితిత్తుల్లో వాపే కారణమా?
దిశ, ఫీచర్స్: కాలాలు మారినప్పుడల్లా దగ్గు, జలుబు సాధారణంగా వస్తుంటాయి. దీంతో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. కొంతమందికి తొందరగా ఈ సమస్యల నుంచి విముక్తి పొందినప్పటికీ మరికొంతమందికి వారం, రెండు వారాల దాకా కంటిన్యూస్ గా ఇబ్బంది పెడుతుంటుంది. కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, గొంతు రాపు, ముక్కు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం (ముక్కు దిబ్బడ), తలనొప్పి, జ్వరం ఇలా.. కొన్ని లక్షణాలు కొంతమందిలో రెండు వారాల వరకు ఉండిపోతాయి. ఇది మిగతా ఆరోగ్య సమస్యలతో కలిసి న్యుమోనియాగా మార్పు చెందవచ్చు.
అయితే కొంతమందికి జలుబు తగ్గాక కూడా విపరీతమైన దగ్గు అలాగే వెంటాడుతుంటోంది. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పెడుతుంది. రీసెంట్ గా ఒక అధ్యయనంలో 11 శాతం నుంచి 25 శాతం మంది పెద్దలు జలుబు తర్వాత దగ్గుతో బాధపడుతున్నారని తేలింది. ఈ దగ్గు మూడు నుంచి ఎనిమిది వారాల వరకు ఉంటుంది. దీన్నే పోస్ట్-ఇన్ఫెక్షన్ కఫ్ అంటారు.
అయితే ముక్కు, గొంతు, లంగ్స్‌లో వాపు పెరగడం కారణంగా దగ్గు వస్తుందని తాజాగా ఈఎన్ టీ వైద్యులు చెబుతున్నారు. వాపు శ్లేష్మం ఏర్పడే ప్రక్రియను పెంచుతుంది. కరోనా మహమ్మారి తర్వాత ఈ సమస్య మరింతగా పెరిగింది. దీంతో చాలా మంది యాంటీబయాటిక్స్ లేదా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇలాంటివి వాడడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందని.. దగ్గు ఎటువంటి ఔషధం లేకుండా దానంతట అదే తగ్గుతుందని చెబుతున్నారు.
దగ్గినప్పుడు ఒకవేళ ఛాతిలో నొప్పి, కఫంలో రక్తస్రావం, మింగడంలో ఇబ్బంది అనిపించడం, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే ఛాతీ ఎక్స్-రే తీయించుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.