ఏనుగులు కూడా మాట్లాడుకుంటాయ్.. పేర్లు పెట్టి పిలుచుకుంటాయ్..

by Javid Pasha |
ఏనుగులు కూడా మాట్లాడుకుంటాయ్.. పేర్లు పెట్టి పిలుచుకుంటాయ్..
X

దిశ, ఫీచర్స్ : భూమిపై మానవులతోపాటు అనేక రకాల జీవరాశి మనగడ సాగిస్తోంది. నిజం చెప్పాలంటే ప్రకృతి మొత్తం జీవ వైవిధ్యానికి నిలయం. అయినప్పటికీ జీవజాతులన్నింటిలో మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి భాష లేదా కమ్యూనికేషన్. మనం సమాజంలో ప్రతి ఒక్కరినీ పేర్లు పెట్టి పిలుస్తాం. ఆ పేర్లతోనే మనుషులు, జంతువులను గుర్తిస్తుంటాం. ఇదంతా కామన్. కానీ ఏనుగులు కూడా తమదైన పద్ధతిలో పేర్లు పెట్టి పిలుచుకుంటాయని మీకు తెలుసా?.. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

స్టడీలో భాగంగా రీసెర్చర్స్ అంబోసెలి నేషనల్ పార్క్, సంబూరు నేషనల్ రిజర్వ్‌లోని 100 ఆఫ్రికన్ సవన్నా ఏనుగులపై ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇందుకోసం ‘మిషిన్ లెర్నింగ్ మోడల్’ని ఉపయోగించారు. ఏనుగులు కూడా తమలో తాము మాట్లాడుకోవడం, ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం చేస్తాయని ఈ సందర్భంగా గుర్తించారు. అంతేకాకుండా వాటి అరుపులు, శబ్దాలు, ఘీంకారాల ద్వారా పేర్లు పెట్టి పిలుచుకోవడం, కోడ్ భాషను ఉపయోగించడం చేస్తాయట. అందుకే పరిస్థితులకు తగ్గట్లు ఏనుగులు తమ శబ్దాలను, ఘీంకారాలను మార్చుతుంటాయి. వెరైటీ వేరియషన్లు కనిపిస్తుంటాయి. వాటి అర్థం ఏమిటో మనుషులకు అర్థం కాకపోవచ్చు కానీ సాటి ఏనుగులకు అర్థం అవుతుందట.

Advertisement

Next Story