- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ డ్రై ఫ్రూట్ నీరు తాగడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. దీని కోసం కొంతమంది మందులు వాడుతుంటారు. అయిన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే కొన్ని సాధారణ చిట్కాలు కూడా బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి. వాటిలో ఎండు ద్రాక్ష నీరు మంచిగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. మీరు క్రమం తప్పకుండా ఎండుద్రాక్ష నీరు త్రాగితే 10 రోజుల తర్వాత మీ శరీరంలో మార్పులను గమనించవచ్చు. బరువు తగ్గడమే కాకుండా, ఇది కొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఎండుద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల ఇక్కడ చూద్దాం..
మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా, మలినాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎండు ద్రాక్ష తాగడం వల్ల ఈ మలినాలను తొలగిస్తుంది అలాగే మీ శరీరాన్ని లోపల కూడా శుభ్రపరుస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచుతాయి.
ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఆకలిని నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నిద్ర లేకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఎండు ద్రాక్ష నీరు తాగడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.