మీరు బ్రష్ చేస్తున్నప్పుడు పేస్ట్ తియ్యగా అనిపిస్తోందా?.. డేంజర్‌లో పడ్డట్టే!

by Javid Pasha |
మీరు బ్రష్ చేస్తున్నప్పుడు పేస్ట్ తియ్యగా అనిపిస్తోందా?.. డేంజర్‌లో పడ్డట్టే!
X

దిశ, ఫీచర్స్ : మీరు తరచుగా చూయింగ్ గమ్ తింటున్నారా?.. బ్రష్ చేసేటప్పడు వాడే పేస్ట్ సాధారణంకంటే తియ్యగా అనిపిస్తోందా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. ఎందుకంటే ఇది కొన్ని అనారోగ్య పరిస్థితులకు సంకేతమని నిపుణులు చెప్తున్నారు. పైగా వీటిలో కృత్రిమ స్వీటెనర్లు ఉండటంతో గుండె జబ్బులు ఉన్నవారిలో రక్తం గడ్డకట్టే పరిస్థితికి ప్రేరణగా నిలుస్తాయి. తద్వారా హాని కలిగిస్తాయని యూఎస్‌లోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నిపుణుల తాజా అధ్యయనంలో వెల్లడైంది.

యూరోపియన్ హార్ట్ జర్నల్ వివరాల ప్రకారం కూడా.. చూయింగ్ గమ్, పేస్ట్‌లోని ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌లో ‘జిలిటాల్’ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారిలో, అలాగే ఒబేసిటీ, హైబీపీ ఉన్నవారిలో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సంఘటనల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా జిలిటాల్‌ను(Xylitol) సురక్షితమైన చక్కెరకు ప్రత్యామ్నాయంగా వివిధ పదార్థాల తయారీలో యూజ్ చేస్తుంటారు. కాకపోతే ఇది మోతాదుకు మించి వాడటంవల్ల మాత్రమే గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story