Cinnamon tea దాల్చిన చెక్క టీ తాగితే షుగర్ తగ్గుతుందా?

by Prasanna |   ( Updated:2023-06-25 07:16:20.0  )
Cinnamon tea దాల్చిన చెక్క టీ తాగితే షుగర్ తగ్గుతుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : దాల్చిన చెక్కవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు వెల్లడించిన విషయం మన అందరికి తెలిసిందే. షుగర్ సమస్య ఉన్న వారు దీనిని తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుంది. ఆయుర్వేదంలో దాల్చిన చెక్కని రక్తంలో స్థాయిలను తగ్గించేందుకు సాయపడే ఉత్తమ సహజ సప్లిమెంట్స్ అని పిలుస్తారు.

దాల్చిన చెక్క.. చెట్టు బెరడులో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడం నుంచి తీవ్రమైన మంటను తగ్గించి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడేవరకూ దాల్చిన చెక్క ఇలా అన్నింటికీ మంచి చిట్కా. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి కంట్రోల్ చేయడంలో దాచిన చెక్క బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కలో సిన్న మాల్డిహైడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ విడుదలని ప్రోత్సహిస్తుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రాత్రి భోజనం తర్వాత దాల్చిన చెక్క టీ తాగడం వల్ల షుగర్ కంట్రోల్‌ చేయడానికి సహాయ పడుతుంది.

Advertisement

Next Story