- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మీకు విపరీతమైన ఆకలి వేస్తుందా ? కారణం ఇదే..
దిశ, ఫీచర్స్ : కొంతమందికి సాధారణం కంటే ఎక్కువ ఆకలి వేస్తుంటుంది. ఆకలిగా అనిపించడం అనేది శరీర సహజ ప్రక్రియ. కానీ మీరు ఎక్కువగా తినాలని భావిస్తే అది ఆందోళన కలిగించే విషయం అని అంటున్నారు నిపుణులు. నేటికీ భారతదేశంలో ఆహారపు అలవాట్లకు సంబంధించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఒకటి బాగా ఆకలి వేస్తే ఆరోగ్యంగా ఉంటారు అనేది. ఎందుకంటే శరీరం ఆహారాన్ని డిమాండ్ చేస్తుంటే మీరు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు. ఇలా ఆలోచించడం సరి కాదంటున్నారు నిపుణులు. విపరీతమైన ఆకలి వెనుక శరీరంలో కొన్ని సమస్యలు ఉండవచ్చని ఇలా నిరంతరం జరుగుతుంటే కడుపు, కాలేయం, మూత్రపిండాలు లేదా ఇతర అవయవాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని చెబుతారు వైద్యనిపుణులు.
అధిక ఆకలి..
సాధారణంగా భోజనం చేసిన తర్వాత కూడా మీ కడుపు ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తున్నా, ఎంత తిన్నా కడుపు నిండనట్టు ఉన్నా మళ్ళీ ఆహారం తింటూ ఉంటాం. అధిక ఆకలి కారణంగా ప్రజలు అధిక కేలరీలను తీసుకుంటారు. ఇది బరువు పెరుగుదలకు దారితీస్తుంది.
అధిక ఆకలి మధుమేహం ముఖ్యమైన లక్షణం అని డైటీషియన్లు చెబుతున్నారు. ఇలా ఎవరికైనా జరిగితే వారు ముందుగా షుగర్ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. అలాగే హార్మోన్ల అసమతుల్యత, హైపర్ థైరాయిడిజం, మానసిక స్థితి, పోషకాహార లోపంతో కూడా దీనికి కారణం కావచ్చని చెబుతున్నారు. ఒక్కోసారి ఒత్తిడి కారణంగా అతిగా తింటూ ఉంటారు. ఒక వ్యక్తి తగినంత మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ లేదా ఇతర పోషకాలను తీసుకోకపోతే అది వారి ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అధిక ఆకలి సమస్య కూడా ఉండవచ్చు.
మనిషికి తగినంత నిద్ర లేకపోతే వారు అధిక ఆకలి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని డైటీషియన్లు చెబుతున్నారు.
డైట్ లో మార్పులు...
ఒక వ్యక్తికి విపరీతంగా ఆకలి వేస్తుంది అంటే వారు డైట్ విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు అంటున్నారు. తక్కువ మొత్తంలో భోజనం చేయడం మంచిదంటున్నారు. తీసుకునే డైట్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. అల్పాహారంలో ప్రోటీన్ సోర్స్ తినాలి. అలాగే భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని బాగా నమలాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలని నిపుణులు చెబుతున్నారు. సలాడ్, పండ్లు లేదా గింజలను తినాలని చెబుతున్నారు. రోజులో వీలైనంత ఎక్కువ నీరు తాగాలంటున్నారు.
Read More..