మాంసాహారం తిని ఆలయాలకు ఎందుకు వెళ్లకూడదో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-18 10:24:17.0  )
మాంసాహారం తిని ఆలయాలకు ఎందుకు వెళ్లకూడదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆలయాలకు వెళ్లడం చాలా మందకి ఇష్టం. అందుకే మనసుకు ఏదైనా బాధగా అనిపించినా లేదా, సంతోషం సమయంలో కూడా కొందరు గుడికి వెళ్తుంటారు. అయితే మన పెద్దవాళ్లు చెబుతుంటారు. మాంసం తిన్నాక గుడికి వెళ్లకూడదని. అయితే దీని వెనుకున్న రీజన్ మాత్రం చాలా మందకి తెలియదు. కాగా, అసలు మాంసం తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరైనా సరే మాసిక ప్రశాంతత, అలసటను మరిచి కొద్దిసేపు సంతోషంగా గడపడానికి గుడికి వెళ్తారు. అయితే మాంసాహారం తిన్నప్పుడు మీ శరీరం, మనస్సు కొద్దిగా అలసిపోయినట్లుగా, మందగించినట్లు అనిపిస్తుంది. అలాంట‌ప్పుడు మీరు ఆల‌యానికి వెళితే అక్క‌డి సానుకూల ప్రకంపనలను అనుభవించడానికి మీ మనస్సు, శరీరం అంగీకరించవట. మాంసాహారంలో తామసిక‌ గుణాలు ఎక్కువగా ఉన్నందున, మీ మనస్సు మంచి ఆలోచనలు, ప్రకంపనలను అనుభవించడానికి అనుమతించదు. ఇది మీ అంతర్గత ప్రశాంతతకు భంగం కలిగిస్తాయంట. అందువలన మాంసాహారం భోజనం చేసి గుడికి వెళ్లకూడదు అంటారంట.

నోట్ : ఇది ఇంటర్నెట్‌లోని నిపుణుల సమాచారం మేరకే ఇవ్వబడినది. దిశ వెబ్ సైట్ దీనిని ధృవీకరించడం లేదు

ఇవి కూడా చదవండి:

దేవాలయం నీడ ఇంటి మీద పడకూడదా?

పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు వస్తే ఏం చేయాలి?

Advertisement

Next Story

Most Viewed