జుట్టు, గోర్లు కత్తిరించేటప్పుడు ఎందుకు నొప్పి ఉండదో తెలుసా?

by Jakkula Samataha |
జుట్టు, గోర్లు కత్తిరించేటప్పుడు ఎందుకు నొప్పి ఉండదో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మన శరీరంలోని పార్ట్స్ చాలా సున్నితమైనవి. ఏ చిన్న దెబ్బతాకినా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తల, చేతులు, కాళ్లు ఇలా ఏ ఒక్క అవయవానికి దెబ్బతాకినా చాలా నొప్పిగా ఉండటమే కాకుండా, అతిగా తాకితే డాక్టర్ సహాయం కూడా అవసరం అవుతుంది. కానీ మన శరీరంలో కొన్ని అవయవాలకు దెబ్బ తాకినా ఎలాంటి నొప్పి అనిపించదు. అవే గోర్లు, వెంట్రుకలు. మన శరీరంలో భాగమైన జుట్టు, గోర్లు మాత్రం మన అవయవాలకు భిన్నంగా స్పందిస్తాయి. వాటిని కత్తిరించినా, లేదా వాటిని మనం కర్రతో కొట్టినా ఏం చేసినా ఎలాంటి నొప్పి అనిపించదు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గోర్లను, వెంట్రుకలు కట్ చేస్తే ఎందుకు నొప్పి పెట్టదో..కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక గోళ్లు, వెంట్రుకలు కత్తిరించేటప్పుడు నొప్పి రాకపోవడానికి గల కారణం మృతు కణాలంట. ఈ కణాల్లో కెరాటిన్ అనే ప్రొటీన్ పూర్తిగా నిర్జీవమై గోళ్లలోను, వెంట్రుకల్లోను ఉంటుందంట. అందువలన మనం గోర్లను లేదా వెంట్రుకలను కత్తిరించినప్పుడు నొప్పి ఉండదు అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story