కొందరి చేతికి ఆరు వేళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా?

by Jakkula Samataha |
కొందరి చేతికి ఆరు వేళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చేతికి వేళ్లు ఉండటం సహజం.ఇక ప్రతి ఒక్కరి చేతికి ఐదు వేళ్లు మాత్రమే ఉంటాయి. కానీ కొందరికి ఆరు వేళ్లు ఉండటం మనం చూస్తుంటాం. 100 మందిలో ఇద్దరు లేదా ముగ్గురికి వారి చేతులకు లేదా కాళ్లకు ఆరు వేళ్లు ఉంటాయి. అయితే ఇలా ఆరు వేళ్లు ఉంటే అదృష్టం అని కొందరు నమ్ముతారు.

ఎవరికైతే ఎక్కువ అదృష్టం ఉంటుందో వారికే ఆరు వేళ్లు ఉంటాయని చెబుతుంటారు. కాగా, దీన్ని మూఢనమ్మకంగా కొందరు కొట్టి వేస్తే మరికొందరు నమ్ముతారు. అయితే సైన్స్ ప్రకారం ఆరు వేళ్లు ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కాగా, దీనిపై ఇటీవల పరిశోధనలు చేసిన నిపుణులు, ఇది మాక్స్ అనే జన్యువులోని పరివర్తన కారణంగా జరుగుతుందని తెలిపారు. ఈ అరుదైన రుగ్మత శిశువుల అదనపు వేళ్లు, బహుళ అవయవాల్లో లోపాలకు కారణమని గుర్తించారు. అదనపు వేళ్లు ఉండటం అనేది మెదడు అభివృద్ధికి సంబంధించిన ఆటిజం లక్షణాలకు దారితీస్తుందని తెలిపారు. ఈ వ్యక్తుల DNA అధ్యయనంలో వారికి పుట్టుకతో వచ్చే లోపాలు లేదా రుగ్మతలకు కారణం జన్యు పరంగా కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed