జీన్స్ ప్యాంట్‌కు చిన్న జేబు ఎందుకు ఉంటుందో తెలుసా?

by Jakkula Samataha |
జీన్స్ ప్యాంట్‌కు చిన్న జేబు ఎందుకు ఉంటుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : యువతను ఎక్కువ ఆకర్షించే ప్యాంట్స్‌లో జీన్స్ ప్యాంట్సే ముందుంటుంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా, పార్టైనా సరే జీన్స్ వేసుకోవడానికే ఇట్రెస్ట్ చూపిస్తుంటారు.ఇక యువతను ఆకర్షించడానికి జీన్స్ క్లాత్‌లోనే డిఫరెంట్ డిజైన్స్‌లో ప్యాంట్స్ తయారు చేస్తున్నాయి కంపెనీస్.ఇక జీన్స్ ప్యాంట్‌లో చూడటానికి చాలా జేబులు ఉంటాయి. ముఖ్యంగా ప్యాంట్ ముదు ఉన్న ఓ జేబులో చిన్న ప్యాకెట్ ఉంటుంది. అసలు అది ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? కానీ దానికీ ఓ చరిత్ర ఉందంట.

అసలు విషయంలోకి వెళ్లితే.. నిజానికి ఆ జేబును ఊరికే కనిపెట్టలేదుంట.కొంత మంది ఆ జేబును చూసి ఫ్యాషన్ కోసం అనుకుంటారంట. కానీ ఆ జేబు పెట్టడానికి ఓ కారణం ఉంది. 18, 19 శతాబ్దాల్లో చేతి గడియారాలు లేవు. జేబులో పాకెట్లో పెట్టుకునే వాచీలు మాత్రమే ఉండేవి. దీంతో అందరూ ఆ గడియారాలను ప్యాంట్ సాధారణ జేబులో పెట్టుకునేవాళ్లు. అయితే జేబు గడియారాలు కొద్ది రోజుల్లోనే పగిలిపోయేవి. దీనికి పరిష్కారంగా ప్రముఖ జీన్స్ సంస్థ లెవిస్ స్ట్రాస్ ఓ బుల్లి పాకెట్ను తమ జీన్స్ ప్యాంటు సెట్ చేసింది. దీంతో అందరూ వాచీని ఆ చిన్న జేబులో పెట్టుకొని, చైన్ ను బెల్టుకు కట్టుకునేవారట. అలా మొదలైన చిన్న పాకెట్ నేడు ఫ్యాషన్ కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed