- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తరచూ ఇన్ఫెక్షన్లు ఎందుకొస్తాయో తెలుసా?
దిశ, ఫీచర్స్: ఈ మధ్య చాలా మందిని రకరకాల ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతున్నాయి. అందులో కొన్ని వైరస్ వల్ల వస్తుంటే.. మరికొన్ని బ్యాక్టీరియావల్ల వస్తున్నాయి. ఇన్ఫెక్షన్లను మొదటిదశలో గుర్తించకపోతే తీవ్రమైన అనారోగ్యానికి దారితీసే అవకాశం కూడా ఉందంటున్నారు వైద్య నిపుణులు. బాక్టీరియా, వైరస్ అనేవి రెండు కూడా ఒకే కణ సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్ల వ్యాప్తిలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం సీజన్ మారే క్రమంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు చాలామందిని వేధిస్తున్నాయి.
వాతావరణంలో కొన్ని వేలకొద్ది సంఖ్యలో బ్యాక్టీరియాలు ఉన్నాయంటున్నారు సైంటిస్టులు. అయితే ఇందులో 1 నుంచి 5 శాతం వరకు మాత్రమే వ్యాధికారకాలని, అవే మనుషుల్లో వివిధ అనారోగ్యానికి కారణం అవుతున్నాయని చెప్తున్నారు. వాంతులు, అజీర్తి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యకు బాసిల్లస్ సెరియస్, క్లోస్ట్రిడియం బోటులినమ్, ఎస్చెరిచియా కోలి, సాల్మోనెల్లా ఎస్‌పిపి అనే వివిధ రకాల ఫుడ్‌బోర్న్ పాథోజెనిక్ బ్యాక్టీరియా కారణం అవుతుందట. పలు సందర్భాల్లో వైరస్‌లు, పరాన్నజీవులు కూడా వీటికి కారణం అవుతుంటాయి. అయినప్పటికీ బ్యాక్టీరియల్ వాహకాల ద్వారానే వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఫీవర్, స్టమక్ పెయిన్,వికారం, వాంతులు, అతిసారం వంటివి వ్యాపించడంలో బ్యాక్టీరియాలు కీలకంగా పనిచేస్తాయి.
లక్షణాలు
కింద పడినప్పుడు లేదా ఏదైనా ప్రమాదంలో శరీరంపై ఏర్పడే గాయాలు పొక్కు కట్టడం, చీము ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. రోగకార బ్యాక్టిరియా సంక్రమణ ద్వారా ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. స్టెఫిలోకాకస్, ఆరియస్ అనే బాక్టీరియాలు అందుకు దోహదం చేస్తాయట. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం కూడా అధికంగా పొక్కులు ఏర్పడటానికి కారణం అవుతుంది. ముఖంపై ఏర్పడే మొటిమలు చీము కారడం కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా జరుగుతుంది. అలాగే జలుబు, గొంతులో నొప్పి, మంట, నిరంతరం దగ్గు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల మూలంగా రావచ్చు.
కోరింత దగ్గు పెర్టుసిస్ అనేది బోర్డెటెల్లా పెర్టుసిస్ అనే బాక్టీరియా కారణంగా వస్తుంది. దీనివల్ల పిల్లల్లో అలసట, జ్వరం, కంటిన్యూయెస్‌గా దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే యూరినరీ ట్రాక్ట్(మూత్రనాళంలో ఆటంక ఏర్పడటం) వంటి అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్‌లు ఎస్చెరిచియా కోలి బాక్టీరియం అనే బాక్టీరియా కారణంగా వస్తాయి. మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. క్లోస్ట్రిడియం డిఫిసిల్ అనే బ్యాక్టీరియావల్ల వాంతులు, విరేచనాలు, అలసట, మోషన్స్ అవడం, కడుపునొప్పి వంటివి సంభవిస్తాయి. హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ద్వారా గ్యాస్ట్రిటిస్ సమస్య ఏర్పడి ఇబ్బంది పెడుతుంది.
ఇవి కూడా చదవండి : High Blood Pressure: హైబీపీ వెంటనే కంట్రోల్ అవ్వాలంటే.. ఈ జ్యూస్ తాగితే చాలట!