మహిళ నాగ అఘోరాలు నగ్నంగా ఎందుకు ఉండరో తెలుసా?

by Jakkula Samataha |
మహిళ నాగ అఘోరాలు నగ్నంగా ఎందుకు ఉండరో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : అఘోరాలు అంటే చాలా మంది భయపడతారు. కొంత మంది వీరిని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మనం ఎక్కువగా వీరిని సినిమాల్లోనే చూస్తుంటాం. ఈ అఘోరాలు శివున్ని స్మరిస్తూ కాశీలో ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు.

ఇక వీరు ఎప్పుడూ బయటకు రారు. కానీ మహా కుంభమేళా, కుంభం మేళ సమయంలో అఘోరాలు, నాగ సాధువులు బయటకు వచ్చి పూజలు చేస్తుంటారు. వీరు చూడటానికి కాస్త భయంకరంగా ఉంటారు. ముఖ్యంగా అఘోరాలు ఒంటి నిండా బూడిదితో నగ్నంగా ఉంటారు.కానీ మహిళా నాగ అఘోరాలు మాత్రం బట్టలు ధరించే కనిపిస్తారు.

అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు మహిళ నాగ అఘోరాలు ఎందుకు బట్టలు లేకుండా ఉండరని? దీనికి ఓ కారణం ఉన్నదంట.

శుచిత కారణంగా అఖారాలోని మహిళా నాగ సాధువులు ఒకే వస్త్రాన్ని ధరించాలనే నియమం ఉన్నదంట. అందు వలన మహిళా నాగ సన్యాసులు ఒకే ముడి సహాయంతో ఆమె శరీరం మొత్తం కప్పి ఉంచే వస్త్రాన్ని ధరిస్తారంట.అంతే కాకుండా ఒక మహిళ, నాగ సాధువు అయినప్పుడు మిగిలిన వారందరూ ఆమెను అమ్మ అనిపిలుస్తుంటారంట.

Advertisement

Next Story