- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎరుపు రంగు చూస్తే ఎద్దులు ఎందుకు రెచ్చిపోతాయో తెలుసా?
దిశ, ఫీచర్స్ : మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం ఎరుపు రంగు వస్త్రం చూస్తే ఎద్దు కోపానికి గురై పరుగులు పెడుతుంటుంది. అంతే కాకుండా మన పెద్దవారు కూడా చెబుతుంటారు. ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఎద్దుకు ఎదురు వెళ్లకండి, అవి బెదురుతాయి, పొడవడానికి వస్తుంటాయని. అయితే మరి మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా ? అసలు ఎరుపు రంగును చూస్తే ఎద్దులు ఎందుకు బెదురుతాయి. అసలు నిజంగానే ఎద్దులకు ఎరుపు రంగు అంటే నచ్చదా? కాగా, ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎద్దులకు రెడ్ కలర్ అస్సలే కనిపించదంట. వాటికి నీలం, ఆకుపచ్చ రంగులు మాత్రమే కనిపిస్తాయంట. ఎరుపు రంగును అవి అసలే చూడలేవంట. అయితే ఎరుపు రంగు సరైన విధంగా కనిపించకపోవడంతో అవి బెదిరినట్లు చేస్తాయంట.
అయితే యూరప్‌లోని స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో బుల్‌ఫైట్ బాగా పాపులరైన క్రీడల్లో ములేటా ఒకటి. ఈ క్రీడలో ఎరుపు రంగు జెండాను ఎద్దుల ముందు అటూఇటూ ఊపుతూ, వాటిని రెచ్చగొడతారు. దీంతో ఎద్దు ఒక్కసారిగా కోపంగా దూసుకొస్తుంది.అయితే అవి ఎరుపు రంగును చూసి పరిగెత్తవంట. మటడోర్ ములేటాను ఊపుతున్నప్పుడు, దాని కదలికలకు ఎద్దు బెదిరిపోయి రివ్వున దూసుకొస్తుంది కానీ ఎరుపు రంగు వల్ల మాత్రం కాదంటున్నారు నిపుణులు.