- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షుగర్ కంట్రోల్ చేసే సూపర్ ఫుడ్స్.. ఏంటో తెలుసా..
దిశ, ఫీచర్స్ : ఒకప్పటి కాలంలో మనుషులు ఎంత స్ట్రాంగ్ గా ఉండేవారో ఇప్పటి కాలం వారు అన్ని వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలివారి వరకు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఎక్కువ మందిని సతమతం చేస్తుంది. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో ఈ షుగర్ బారిన పడుతున్నారు. మరి ఈ వ్యాధి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి, షుగర్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, నిపుణులు ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతులు..
మన వంటింట్లో ఉండే మెంతులు షుగర్ ను తరిమేయడంలో ముందుంటాయి. మెంతుల్లో ఉండే ఫైబర్ చక్కెర శోషణను తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది.
పసుపు..
వంటల్లో వాడే పసుపు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఆయుర్వేద వైద్యంలో పసుపునకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పసుపు యాంటిబయాటిక్.. ఇది శరీంలో ఉండే ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ని పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు దూరం చేస్తాయి.
కాకరకాయ..
కాకరకాయ రుచికి చేదుగా ఉన్నా దాని ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయి. కాకరకాయ శరీరంలోని అధిక గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంట్లోని చరాంటిన్ రసాయనం ఆరోగ్యాన్ని పెంచి షుగర్ లెవల్ ని తగ్గిస్తుంది.
ఉసిరి..
మధుమేహాన్ని తరిమికొట్టడంలో ఉసిరి కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. పచ్చి ఉసిరి తినడం వలన, దాని రసం తాగడం వలన అందులో ఉండే పోషకాలు షుగర్ రాకుండా చేస్తాయి. ఉసిరిని ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు.
తృణధాన్యాలు..
శరీరానికి తృణధాన్యాల నుంచి ఫైబర్ అత్యధికంగా అందుతుంది. ఇవి రక్తప్రవాహంలోకి నెమ్మదిగా గ్లూకోజ్ ను విడుదల చేసి షుగర్ ను నివారిస్తుంది. తృణధాన్యాలు తినడం వలన ఆహారంలో కొత్త రుచిని చూసినట్టు ఉంటుంది. తృణధాన్యాలు శరీరాన్ని దృఢంగా చేస్తాయి.