మొలతాడుకు, మగవారికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

by Disha Web Desk 8 |
మొలతాడుకు, మగవారికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రతి అబ్బాయికి మొలతాడు అనేది తప్పనిసరిగా ఉంటుంది. మగపిల్లవాడు పుట్టిన తొమ్మిదో రోజున మొలతాడు కడుతుంటారు. ఇక చనిపోయేవరకు ఆ మొలతాడు అనేది తప్పనిసరిగా ఉండాలి అంటారు.అంతే కాకుండా మన పెద్దవారు మొలతాడు కట్టని వాడు మగవాడే కాదు అని అంటుంటారు.అయితే మొలతాడుకు, మగవారికి మధ్య ఉండే సంబంధం ఏంటీ , ఎందుకు మన పూర్వీకులు మొలతాడు విషయంలో అంతపట్టింపులు చూపుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ మతంలో మగవారంతా మొలతాడు కట్టుకుంటారు. పురాతన కాలం నుంచి కూడా ఇలా నడుముకు మొలతాడు కట్టుకునే సంప్రదాయం ఉంది. అయితే నల్లని తాడును నడుము చుట్టూ కట్టడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం ఉండదని పెద్దలు చెబుతుంటారు. వేదాలలో మనకు కొన్ని జీవన సూత్రాలు ఉన్నాయి. స్నానం చేసే సమయంలో పూర్తి నగ్నంగా ఉండటం మంచిది కాదని, శరీరంపై కనీసం చిన్న గుడ్డ అయినా ధరించాలని చెబుతుంటారు. ముఖ్యంగా ఆడ పిల్లలకు చిన్నప్పుడు సిగ్గుబిళ్ల కడుతుంటారు. వారికి వివాహం జరిగిన తర్వాత 47 మంగళసూత్రం ధరిస్తారు. అయితే అదే తరహాలో మగవారికి కూడా మొలతాడు చాలా ముఖ్యం అనే భావన ఉంది. చనిపోయినప్పుడు అతని దేహం నుంచి మొలతాడును తీసేస్తారు. దీనిని పవిత్రంగా భావించడం వల్ల ఇలా చేస్తారు. అంతే కాకుండా పుట్టిన తర్వాత చిన్న పిల్లలకు కూడా చాలా అట్టహాసంగా మొలతాడు కడుతుంటారు. అయితే చిన్నప్పుడు నిక్కరు జారీ పోతుందనే కారణంగో కడుతారు అని చాలా మంది అనుకునే వారు. అయితే చిన్ని కృష్ణయ్యకు బంగారు మొలతాడు ఉండేదంట. అందుకే మగవారికి చిన్నప్పుడే మొలతాడు కడుతుంటారు.

Next Story

Most Viewed