నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by Prasanna |
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా మనలో చాలా మంది ఫుడ్ డైట్లో డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటారు. వాటిలో ఎక్కువగా తీసుకునేది వాల్‌నట్స్. ఎందుకంటే దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని గింజలు రూపంలోనే కాకుండా సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కొంత మంది వీటిని స్నాక్స్ గా బాగా ఆస్వాదిస్తారు. అయితే ప్రతిరోజూ ఉదయం పరగడుపున నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ను తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇక్కడ చూద్దాం..

గుండె పనితీరు

నానబెట్టిన వాల్‌నట్‌లను రోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, ఎందుకంటే వాటిలో మూడు రకాల ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

మెదడు ఆరోగ్యం

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరుకు తోడ్పడతాయి.

చర్మ ఆరోగ్యం

వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది ముఖ్యంగా ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది.

కార్బోహైడ్రేట్ నియంత్రణ

వాల్ నట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది, మీ బ్లడ్ షుగర్ చాలా త్వరగా పెరగకుండా చేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

నిద్ర

వాల్‌నట్‌లో మెలోటినైన్ ఉంటుంది. హార్మోన్లను ప్రేరేపించడం ద్వారా నిద్రను మెరుగుపరుస్తుంది. అలాగే ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story