- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ వయస్సులో ఎంత విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాలో తెలుసా.. ?
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులను నివారించడానికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. వీటి వల్ల మన శరీరం సక్రమంగా పని చేయగలుగుతుంది. ప్రస్తుతం చాలా మందిలో విటమిన్ బి12, డి లోపం పెరుగుతోంది. విటమిన్ డి గురించి మాట్లాడితే ఇది కొవ్వులో కనిపిస్తుంది. దీనినే సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. ఎముకలను దృఢంగా ఉంచడంలో ఇది చాలా మేలు చేస్తుంది. ఈ విటమిన్ లోపం ఉన్నవారు దీని సప్లిమెంట్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మన శరీరానికి సహజంగానే సూర్యరశ్మి నుంచి విటమిన్లు లభిస్తాయని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అంటున్నారు. కానీ చలికాలంలో సూర్యకాంతి తక్కువగా ఉండడం వల్ల కొందరికి విటమిన్ డి సరిగా అందదు. శరీరంలో దాని లోపాన్ని భర్తీ చేయడానికి, ప్రజలు మాత్రలు లేదా క్యాప్సూల్స్ తింటారు. విటమిన్ డిని సరిగ్గా ఎలా తీసుకోవాలో ఆరోగ్య నిపుణుల నుంచి తెలుసుకుందాం.
ఈ ఆహారాలతో తినండి..
ఈ విటమిన్ కొవ్వులో కరిగేది అని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన విటమిన్లతో దీనిని తినవచ్చు. మీ ఆహారంలో పాలు, పెరుగు చీజ్, గుడ్లు, కొవ్వు చేపలు, గింజలు వంటి పాల ఉత్పత్తులను చేర్చండి. ఇవి విటమిన్ డి లోపాన్ని తీరుస్తాయి.
ఎంత మోతాదు అవసరం..
మీరు విటమిన్ డి ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది మీ వయస్సు, ఆరోగ్య పరిస్థితి పై ఆధారపడి ఉంటుంది. పిల్లలు, పెద్దలు ప్రతి రోజూ సుమారుగా 600-800 IU విటమిన్ డి మోతాదు తీసుకోవాలి. అలాగే డాక్టర్ సలహా లేదా వైద్య పరిస్థితి ఆధారంగా విటమిన్ డి మోతాదును పెంచవచ్చు.
కాల్షియం కూడా ముఖ్యం..
విటమిన్ డి, క్యాల్షియంతో కూడిన ఆహారం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అందుకే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో విటమిన్ డి తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాల్షియం పాలు, జున్ను, పెరుగులో పుష్కలంగా లభిస్తుంది. వీటిని మీ డైట్ చేర్చుకోండి. అదనంగా, విటమిన్ కె, జింక్, మెగ్నీషియం విటమిన్ డి ని గ్రహించగలవు. 1 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులకు 600 IU డోస్, 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి 800 IU మోతాదు అవసరమని నిపుణులు చెబుతున్నారు.