బిర్యానీతో శరీరానికి అందే పోషకాలు ఎన్నో తెలుసా..?

by sudharani |   ( Updated:2023-04-12 07:59:04.0  )
బిర్యానీతో శరీరానికి అందే పోషకాలు ఎన్నో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. సండే వచ్చిందంటే చాలు ఇంట్లో ఎక్కువగా బిర్యానీ చేసుకునేందుకు ఇష్టపడతారు. అయితే ఇప్పుడు వీధికో ఫుడ్ సెంటర్లు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆరగిస్తున్నారు. అయితే ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని పెద్దలు చెప్తుంటారు. కానీ, మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే.. బిర్యానీలో ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు కూడా ఉంటాయట. అవేంటో తెలుసుకుందాం..

బిర్యానీ తయారు చేసుకునేటప్పుడు అందులో అనేక మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు.. పసుపు, అల్లం, మిరియాలు, మార్వాడి మెంతి ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్కలు మొదలైనవి వేస్తుంటారు. అయితే ఈ సుగంధ ద్రవ్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా బిర్యానీ చేసుకుంటున్నాము అంటే ముఖ్యంగా ఉపయోగించే అంశం మాంసం. చికెన్‌లో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. దీంతో మన శరీరానికి విలువైన పోషకాలను ఈ బిర్యానీ చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా సుగంధ ద్రవ్యాల్లో ఉండే రోగనిరోధక లక్షణాలు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయట. అయితే కొంచెం అధిక మొత్తంలో బిర్యానీని ఆరగిస్తున్నట్లయితే వ్యయామం చేయక తప్పదు.

నోట్: అమితంగా తినే ఏ ఫుడ్ ఐటెమ్ అయినా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Read more:

వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి తప్పించే అద్భుతమైన చిట్కాలు ఇవే!

Advertisement

Next Story