- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amla : రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంత అద్భుతంగా పనిచేస్తాయో!
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఔషధ గుణాలతో కూడుకున్న పసుపును భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నివారించడానికి ఎంతగానో మేలు చేస్తుంది. దీనిలో చాలా శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్, తాపజనక ప్రేగువ్యాధి, ఇతర దీర్ఘకాలిక మంట, సంబంధిత వ్యాధుల లక్షణాల నుంచి రక్షిస్తుంది. అయితే పసుపుతో పాటు ఇమ్యూనిటీ పవర్ పెంచే మరికొన్ని దినుసులు ఎంటో చూద్దాం..
* అల్లం రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేయడమే కాకుండా మంటను కూడా తగ్గిస్తుంది.
* తులసి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆకులను టీ, మాత్రలు రూపంలో తీసుకోండి.
* యాంటీ ఇప్ఫ్లామేటరీ లక్షణాలతో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే ఉసిరిని ఇండియన్ గూస్బెర్రీ అని పిలుస్తారు. వీటిని తాజాగా రసం చేసుకొని తాగాలి.
* వేప ఆకును ఆయుర్వేద వైద్యంలో చాలా ఏళ్ల నుంచే వాడుతున్నారు. వీటిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది సారాలు, పౌడర్లు, నూనెల రూపంలో తీసుకొండి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.