Health Tips మార్నింగ్ బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు చెప్పేది వింటే

by Anjali |
Health Tips మార్నింగ్ బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు చెప్పేది వింటే
X

దిశ, సినిమా: నిత్యజీవితంలో నీటి వాడకం అత్యంత ప్రధానమైనది. బట్టలు ఉతకడం(మంచి బట్టలు మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి), శుభ్రపరచడం(చుట్టూ ఉన్న ప్రాంతాన్ని క్లీన్ గా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవు), నాళాలను శుభ్రం చేయడానికి నీటిని వాడతారు. భవన నిర్మాణాలకు వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం, కాగిత, కలప, సబ్బు, చమురు, లోహాలు, గ్యాసోలిన్, పెట్రోలియం.. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి నీటిని ఉపయోగిస్తారు. మార్నింగ్ లేవగానే ముఖం కడగాలన్నా, స్నానం చేయాలన్నా, జలవిద్యుత్ టర్బైన్‌లను తప్పడానికి, మందు తాగేటప్పుడు గానీ నీటి వాడకం ఉంటుంది. జలచరాలు జీవించడానికి సముద్రంలోని నీరు ముఖ్యమైన భాగంగా చెప్పుకుంటాం.

అయితే కొంతమంది నిద్ర లేవగానే బ్రష్ చేయకుండా వాటర్ తాగేస్తుంటారు కదా? అలా వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? లేక నష్టమా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

బ్రష్ చేయకముందు వాటర్ తాగితే శరీరంలోని మలబద్దకం, పొట్ట సమస్యలు, ఫేస్ పై పింపుల్స్, అజీర్ణం సమస్యలు వంటి ఎన్నో రోగాలు దరిచేరకుండా ఉంటాయి. శరీరంలోని మురికి మొత్తం క్లీన్ అవుతుంది. నైట్ మొత్తం వాటర్ తాగకుండా ఉంటాం కాబట్టి బాడీ హైడ్రేట్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. కాగా మార్నింగ్ లేవగానే నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు నిపుణులు. మార్నింగ్ వాటర్ తాగితే నోటిలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. నోటి దుర్వాసన కూడా ఉండదు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆడవాళ్ల హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. బీపీ, మధుమేహం రోగాలు రావు. ఊబకాయం సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇలా ఉదయం లేవగానే వాటర్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయే తప్ప నష్టమేమి లేదంటున్నారు నిపుణులు.

గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధ‌ృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story