మీరు జీవితంలో సంతోషంగా ఉండాలా.. ఇలా చేయండి

by Jakkula Samataha |   ( Updated:2024-01-28 02:51:32.0  )
మీరు జీవితంలో సంతోషంగా ఉండాలా.. ఇలా చేయండి
X

దిశ, ఫీచర్స్ : సంతోషం సగం వరం హాయిగ నవ్వమ్మా అనే పాట వినే ఉంటారు. సంతోంగా ఉండటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన గొప్పవరం. ఎన్ని కోట్లు ఖర్చుపెట్టుకున్న దీన్ని కొనరాదు. ఇక మీరు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా, టన్నుల కొద్ది బంగారం, వెండి దాచిపెట్టినా సంతోషం అనేది లేకపోతే అవన్నీ వ్యర్థం. బాధలు ఉండటం అనేది సహజం. కానీ వాటి నుంచి బయటపడి నలుగురితో నవ్వుతూ ఉండేవాడే గొప్పవాడు.

ఇక జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే దాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే? కోరికలు అపరిమితమైనవి అని ఆడంస్మిత్ చెప్పారు. అవి ఎంత అదుపులో ఉంటే అంత మంచిది లేకపోతే కోరికలు ఎక్కవై, సంతృప్తి కరువు అవుతుంది. దీంతో సంతోషం అనేదే ఉండదు.

కొందరు అదికంగా సంపాదించాలని, సపాదన మాయలో పడి ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా, కొంచెం కూడా మనశాంతి లేకుండా జీవిస్తారు. అయితే కొన్ని సార్లు వీరు సంతోషంగా ఉండాలని ప్రయత్నించినా అది కుదరదు. అందుకోసమే సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

సంతోషంగా ఉండాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని పోల్చుకోవడం. ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదంట. తాను బిల్డింగ్ కట్టింది నేను కట్టలేదు, అని ఇలా ఎక్కువగా ఆలోచించకూడదంట. ఎంత ఉన్నా లేకపోయినా.. సర్దుకపోవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ సంపాదించాలనే కోరిక అస్సలే ఉండకూదు. నీలో లోపాలని నువ్వు గుర్తు చేసుకోకూదు. సమస్యల గురించి అస్సలే ఆలోచించకూదు. వీలైనంత ఎక్కువ సేపు ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా, జీవితంలో సంతోషంగా ఉంటారు.

Advertisement

Next Story

Most Viewed