ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం తప్పుగా పంపించారా.. ఇలా ఎడిట్ చేయండి..

by Sumithra |
ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం తప్పుగా పంపించారా.. ఇలా ఎడిట్ చేయండి..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత కాలంలో మనం కమ్యూనికేషన్ ను పెంచుకునేందుకు ఎన్నో మెసేజింగ్ యాప్ లను వాడుతూ ఉంటాం. అన్ని మెసేజింగ్ యాప్ లలో మెసేజ్ ఎడిట్ ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు Instagram లో కూడా DM సందేశాలను సవరించడానికి ఇలాంటి ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. మీరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అయితే, ఈ మెసేజ్ ఎడిట్ ఫీచర్ గురించి మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం..

మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీరు పంపిన మెసేజ్‌ని ఎడిట్ చేస్తే, పంపిన మెసేజ్ ఎడిట్ చేశారని మెసేజ్ రిసీవర్ నోటిఫికేషన్ అందుతుంది. అయితే ఇది ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్‌లో జరగదు. ఈ ట్రిక్‌ని ఉపయోగించడానికి, థర్డ్ పార్టీ యాప్ లేదా మరే ఇతర యాప్స్ ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు.

మెసేజ్ సవరణ ఇలా చేయండి..

ముందుగా మీరు ఇన్‌స్టాగ్రామ్ చాట్‌కి వెళ్లండి.

మీరు పంపిన తప్పుడు ఎస్ఎంఎస్ ని లాంగ్ టైమ్ నొక్కి కాపీ చేయండి.

దీని తర్వాత ఆ సందేశాన్ని తొలగించండి.

తరువాత కాపీ చేసిన మెసేజ్‌ని మళ్లీ చాట్ బాక్స్‌లో పేస్ట్ చేసి, మీరు చేయాలనుకున్న మార్పులు చేసుకోండి.

ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, ఇప్పుడు మీరు ఎడిట్ చేసిన సందేశాన్ని పంపొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన సందేశాలను సవరించడానికి సమయ పరిమితి సెట్ చేసి ఉంటుంది. కొత్త అప్‌డేట్ ప్రకారం, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన సందేశాలను పంపిన 15 నిమిషాల వరకు సవరించుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story