రోడ్డు పక్కన ఉండే ఈ మొక్క చాలా పవర్ ఫుల్.. ఆ స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెడుతుందని తెలుసా?

by Prasanna |
రోడ్డు పక్కన ఉండే ఈ మొక్క చాలా పవర్ ఫుల్.. ఆ స‌మ‌స్య‌ల‌కు కూడా చెక్ పెడుతుందని తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మన చుట్టూ ఉన్న ప్రకృతి అనేక రకాల ఔషధ మొక్కలతో నిండి ఉంటుంది. పురాతన కాలం నుండి వీటిని ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రకృతి ఒడిలో పుట్టిన మరో ఔషధ మొక్క నక్కెర కాయల చెట్టు. రోడ్ల పక్కన చాలా చోట్ల ఈ చెట్టు కనిపిస్తుంది. పండ్లతో నిండిన ఈ చెట్టును పిచ్చి చెట్టు అని కొందరు భావించి పట్టించుకోకుండా ఉంటారు.

ఈ చెట్టు యొక్క పండ్లు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ పండుతో చేసిన కూరలు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. కొందరు దీనిని విరిగి చెట్టు, నక్కెర, బంక చెట్టు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ విరిగి పండ్లలో ప్రోటీన్, క్రూడ్ ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, పీచు, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఈ చెట్టు బెరడు నుండి తయారుచేసిన కషాయం గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. బెరడును నీటిలో మరిగించి, వడకట్టి త్రాగాలి. మీరు రుచి కోసం నల్ల మిరియాలు, తేనె జోడించవచ్చు. ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు యొక్క మహిళల పీరియడ్స్ టైం లోనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

చాలా మంది కొన్ని పదార్థాలను తీసుకున్న తర్వాత చిగుళ్ల వాపు, పంటి నొప్పితో బాధపడుతుంటారు. అలాగే ఇవి నోటి పుండ్లకు కూడా చెక్ పెడుతుంది. నోటి ఆరోగ్యం కోసం, నక్కెర బెరడు పొడిని తీసుకుని, వాటిలో రెండు గ్లాసుల నీటిలో కలిపి, మరిగించి ఈ డ్రింక్ తాగాలి. ఇలా చేయడం వలన పంటి నొప్పి, అల్సర్లు, చిగుళ్ల వాపు తగ్గుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story