తరచూ ఏదో ఒకటి తినే వారిలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని తెలుసా?

by Jakkula Samataha |
తరచూ ఏదో ఒకటి తినే వారిలో డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కొంత మందిని చూస్తే ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఏ కాస్త టైం దొరికినా చిప్స్ లాంటివి తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులు ఎక్కువ మానసిక ఆందోళనలకు గురి అవుతారంట. అతిగా తినే అలవాటు ఉన్న వ్యక్తులు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారని నిపుణులు సూచిస్తున్నారు.

తాజాగా కొందరు పరిశోధకులు చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అయితే అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, ఎక్కువగా డిప్రెషన్‌కు గురయ్యే వ్యక్తులు, దాని నుంచి బయటపడేందుకు ఎక్కువగా ఆహారం తీసుకుంటూ ఉంటారంట. తరచూ ఏదో ఒక వెరైటీ తినడం వలన వారు ఒత్తిడి నుంచి బయట పడగలం అని భావించి, తినడంపై ఎక్కవ శ్రద్ధ చూపుతున్నట్లు సర్వేలో వెళ్లడైంది.

ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారిలో నిరాశ, ఆందోళన, ఉద్రేకం , ఆత్మగౌరవం వంటివి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా డిప్రెషన్‌కు గురి అవుతూ ఉంటారు. అందువలన వీరు తరచూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. అయితే ఇలా అధికంగా తినడం కూడా ఓ వ్యాధే.

ఈ ఈటింగ్ డిజార్డర్ ‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఒక అధ్యయనం ప్రకారం , 2000 , 2018 మధ్య 3.4 శాతం నుంచి 7.8 శాతానికి పెరిగినట్లు సమాచారం. తినే రుగ్మతలు ఉన్న వ్యక్తులు తరచుగా నిరాశ యొక్క లక్షణాలను అనుభవిస్తారు, అవి నిరంతర విచారం, పనికిరాని అనుభూతి ఆటపాటలపై ఆసక్తి చూపకపోవడం, దేనిపై ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం వీరిలో కనిపిస్తుందంట. అయితే ఇలా, డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు వారి మానసిక క్షోభను ఎదుర్కోవడానికి ఒక మార్గంగా తరచూ తినడంపై శ్రద్ధ పెడుతారంట.

అయితే ఇది కూడా ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నందున ఇటువంటి వారిపై కుటుంబ సభ్యులు శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. తరచూ తినడం లేదా, డిప్రెషన్‌కు గురి అయ్యే వారితో ఫ్రీగా మాట్లాడటం, వారిలో ఎలాంటి టెన్షన్ లేకుండా రిలీఫ్‌గా ఉండేలా చేయాలంట. లేకపోతే ఈ వ్యాధితో బాధపడే వారు భవిష్యత్తులో ఊబకాయం, లాంటి జబ్బుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుందంట.

Advertisement

Next Story