Diabetes : పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్.. వీరిలోనే ఎక్కువ!

by Javid Pasha |
Diabetes : పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్.. వీరిలోనే ఎక్కువ!
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో అత్యధిక మంది ఎదుర్కొంటున్న హెల్త్ ఇష్యూస్‌లో డయాబెటిస్ ఒకటి. ఇందులో టైమ్ 1, టైప్ 2 అని రెండు రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే టైప్ 2 చాలా వరకు వయస్సు మీద పడ్డాకే వస్తుంది. ఇక టైప్ 1 మాత్రం వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఫ్యామిలీలో ఎవరికీ లేకపోయినప్పటికీ కొంతమంది పిల్లలకు వచ్చే చాన్స్ ఉంది. ఇటీవల చిన్న వయస్సు గల పిల్లల్లోనూ టైప్ 1 డయాబెటిస్ బయటపడుతోందని నిపుణులు చెప్తు్న్నారు. కొందరికి రెండేండ్ల వయస్సులో, మరి కొందరికి పదహారేండ్ల వయస్సులో వస్తోంది. అయితే ఇది వచ్చే అవకాశం ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లోనే ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకు కారణాలేమిటి? ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.

ఏం జరుగుతుంది?

చిన్న వయస్సులో మధుమేహం రావడంవల్ల పిల్లల్లో ఎదుగుదల సమస్యలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే వారు బాల్యాన్ని మిగతా వారిలాగా సరిగ్గా ఆనందించలేకపోవచ్చు. ఎందుకంటే ఆహారం విషయంలో పరిమితుల కారణంగా ఇష్టమైన ఫుడ్ తినలేరు. పలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మానసికంగానూ సమస్యలు ఎదుర్కొంటారు. ఇకపోతే టైప్ 1 మధుమేహం వచ్చే అవకాశం, అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే ఇది ఎక్కువగా ఉంటుంది. శరీర నిర్మాణంలో తేడాలు, కొన్ని రకాల హార్మోన్ల సమ్మేళనాలు ఇందుకు కారణం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

కారణాలు

ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఐదేండ్లకంటే తక్కువ వయసున్న పిల్లల్లో కనిపిస్తుంది. ఇది ఇన్సులిన్ సరిగ్గా లేనప్పుడు ప్రారంభం అవుతుంది. దీనికి పర్యావరణ కారణాలు, రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం కూడా కారణంగా చెప్పవచ్చు. అలాగే ఇది జీవక్రియ పనితీరు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లలు అన్‌హెల్తీ ఫుడ్ హాబిట్స్ కలిగి ఉండటం, ఆటలు ఆడకపోవడం, ఒకేచోట ఎక్కువగా కూర్చొని ఉండే అలవాటు కూడా పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్‌కు దారితీస్తుంది. వారసత్వంగా వచ్చే అవకాశం ఉంటే గనుక దానిని అడ్డుకోవడం కష్టం. నివారణ చర్యలు, జాగ్రత్తలు పాటించడమే పరిష్కారం.

లక్షణాలు , జాగ్రత్తలు

పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ ఉన్నపపుడు షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. దీంతో తరచుగా అలసగా ఉంటారు. నిద్ర వచ్చేలా అనిపిస్తుంది. ఎక్కువసార్లు యూరిన్‌కు వెళ్తుంటారు. బరువు తగ్గడం, సన్నగా మారడం, శ్వాసలో ఇబ్బందులు, పొట్ట నొప్పి, వాంతులు, దృష్టి మసకబారడం వంటివి కూడా కనిపిస్తాయి. అయితే అన్ని లక్షణాలు అందరిలో ఉంటాయని కాదు. ఏదైనా ఒక లక్షణం, ఒకటికంటే ఎక్కువ లక్షణం కూడా కనిస్తాయి. అలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. టైప్ 1 డయాబెటిస్ ఉన్నపిల్లలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ అలాంటి కేర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డైలీ వ్యాయామాలు చేసేలా చూడాలి. ఇక అమ్మాయిలకంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ ఎక్కువగా రావడానికి శరీర నిర్మాణం, కొన్ని రకాల హార్మోన్ల సమ్మేళనాలు కారణం అవుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story