- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Diabates: డయాబెటిస్‌లో మరో రకం టైప్ 1.5
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య డయాబెటిస్ బాధితులు పెరిగిపోతున్నారు. ఇది అనేక అనారోగ్యాలకు కారణం అవుతోంది. చాలామందికి టైప్-1, టైప్ -2 డయాబెటిస్ గురించి తెలిసిందే. కానీ టైప్ 1.5 డయాబెటీస్ కూడా ఉన్నట్లు చాలామందికి తెలియదు. ఇటీవల కాలంలో దీని బాధితులు కూడా పెరుగుతున్నారు. శరీరంలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారుచేసే కణాలపై ప్రతిరోధకాలు దాడిచేసినప్పుడు ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది చాలా అరుదుగా వస్తుంది. 30 ఏండ్లు పైబడిన వారిలోనూ రావచ్చు.
టైప్ 1.5 బాధితులు సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం(పాలియూరియా). అధిక దాహం (పాలిడిప్సియా), రాత్రిళ్లు తరచుగా మూత్ర విసర్జనకోసం లేవడం (నోక్టురియా), తరచూ అలసట, కంటిచూపు లోపాలు, కాళ్లల్లో జలదరింపు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. బరువు తగ్గడం కూడా టైప్ 1.5 మధుమేహం లక్షణాల్లో ఒకటి. దాదాపు ఇది టైప్ 1 డయాబెటిస్ మాదిరిగానే ఉన్నప్పటికీ, దానంత ప్రమాదకరమైంది కాదు, లక్షణాలు, ప్రభావం కూడా వెంటనే కనిపించవు. పౌష్టికాహారం, ఎక్సర్ జైజ్, హెల్తీ లైఫ్ స్టైల్‌వల్ల దీనిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే లక్షణాలు అధికమైనప్పుడు మాత్రం ఇన్సులిన్ ప్రక్రియ అవసరం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధిని గుర్తించడానికి బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను టెస్టు చేయించుకోవాలి. అలాగే లిపిడ్ ప్రొఫైల్, అల్బుమిన్, పెరిఫెరల్ న్యూరోపతి, రెటినోపతి వంటి టెస్టులు అవసరం అవుతాయి. కాబట్టి లక్షణాలను ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇతర అనారోగ్యాలకు అవకాశం ఉండదు.
ఇవి కూడా చదవండి :