ఆవులకు అందాల పోటీలు.. ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు.. ఫొటోలు వైరల్

by sudharani |   ( Updated:2022-11-29 14:12:42.0  )
ఆవులకు అందాల పోటీలు.. ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు.. ఫొటోలు వైరల్
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా అందాల పోటీలు అంటే స్త్రీలు లేదా పురుషులు పాల్గొనే ఒక ఈవెంట్. కొత్త కొత్త డిజైన్ల డ్రెస్సులు, తల నుంచి కాళ్ల వరకు ధరించిన ఆభరణాలతో కూడిన అందాలతో ప్రేక్షకులను ఆకర్షించడం వారి ముఖ్య ధ్యేయం. కాగా ఇలాంటివన్నీ ఇది వరకు చాలానే చూసాం. కానీ రష్యాలో ఆవులకు అందాల పోటీ నిర్వహించారు.

యాకుటియా ప్రాంతంలో రెండోసారి నిర్వహించిన ఈ పోటీల్లో... సుమారు 24 ఆవులు పాల్గొనగా అందులో మిచియే అనే ఆవు ఈ ఏడాది విజేతగా నిలిచింది. మిచియే అంటే సఖా భాషలో 'చిరునవ్వు‌' అని అర్థం. కాగా ఈ పోటీలో గెలిచినందుకు గాను బహుమతిగా 40లీటర్ల పాల క్యాన్‌ను ఆవు యజమానికి అందించారు. ఇక ఈ పోటీలో పాల్గొన్న ఆవులు కొత్తకొత్త డ్రెస్సులు ధరించి, ర్యాంప్ వాక్‌ చేయగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.

READ MORE

రిమోట్ కంట్రోల్ పురుగులు.. స్టాప్ అండ్ గో లైట్స్‌ను ఫాలో అవుతున్నాయే!!

Advertisement

Next Story