టైప్ - 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తున్న కెఫిన్ !

by Hamsa |   ( Updated:2023-03-16 14:20:48.0  )
టైప్ - 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తున్న కెఫిన్ !
X

దిశ, ఫీచర్స్: కెఫిన్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని మనకు తెలిసిందే. కానీ అందుకు భిన్నంగా అది టైప్ -2 డయాబెటిస్‌ ప్రభావాన్ని తగ్గిస్తుందని తాజా అధ్యయనం చెప్తోంది. రక్తంలో కెఫిన్ పెరగడంవల్ల బాడీలో కొలెస్ర్టాల్ తగ్గుడం మూలంగా ఇలా జరుగుతుందనేది అధ్యయనకర్తల విశ్లేషణ. ఇందుకు సంబంధించిన వివరాలు మార్చి 14న బీజేఎం మెడిసిన్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. కొలెస్ర్టాల్, టైప్ 2 డయాబెటిస్, మేజర్ కార్డియో వాస్క్యులర్ డిసీజెస్‌, లాంగ్ టర్మ్ ప్లాస్మా కెఫిన్ సాంద్రతల గురించిన అనేక అంశాలను తెలుసుకోవడమే లక్ష్యంగా తాజా అధ్యయనం కొనసాగింది.

యూరోపియన్ డేటా విశ్లేషణ

కెఫీన్ థర్మోజెనిక్ ప్రభావాలను కలిగి ఉందని అధ్యయన కర్తలు పేర్కొన్నారు. అంతకు మునుపటి అధ్యయనాలు కూడా కెఫిన్ తీసుకోవడంవల్ల అధిక బరువు తగ్గడం, కొలెస్ర్టాల్ లెవల్స్‌ తగ్గడం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని గుర్తించినట్లు చెప్తున్నారు. అయితే తాజ పరిశోధనలో భాగంగా విశ్లేషించిన డేటా ప్రకారం కాఫీ వినియోగం మధ్య టైప్ 2 డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ ప్రభావాలను తగ్గిస్తుందని వెల్లడైంది. కెఫిన్ మెటబాలిజానికి సంబంధించి నెమ్మదిగాను, వేగంతోను ముడిపడి ఉన్న రెండు నిర్దిష్ట జన్యు ఉత్పరివర్తనాలను పరిశీలించడానికి పరిశోధకులు ప్రధానంగా యూరోపియన్ జనాభా అధ్యయనాల నుంచి డేటాను సేకరించారు. మెండెలియన్ రాండమైజేషన్ ఉపయోగించి, నిపుణుడు సుసన్నా సి లార్సన్ (Susanna C. Larsson) కరోలినా ఇన్ స్టిట్యూట్, స్టాక్‌హోమ్, స్వీడన్, కొలీగ్స్‌తో కలిసి ఆరు జనాభా ఆధారిత అధ్యయనాలను పరిశీలించారు. ముఖ్యంగా యూరోపియన్ జనాభాలో 9,876 మంది వ్యక్తుల జీనోమ్ వైడ్ అసోసియేషన్ మెటా విశ్లేషణ నుంచి వచ్చిన డేటాను పరిగణనలోకి తీసుకున్నారు.

బాడీ మాస్ ఇండెక్స్ తగ్గుతుంది

జన్యుపరంగా వేసిన అంచనాలు లైఫ్ లాంగ్, హయ్యర్ ప్లాస్మా కెఫిన్ సాంద్రతలు లోయర్ బాడీ మాస్ ఇండెక్స్, అండ్ ఫ్యాట్ ద్రవ్యరాశి సూచిక కొవ్వు ద్రవ్యరాశితో సంబంధం కలిగి ఉంటాయి. అలాగే టైప్ 2 డయాబెటిస్ తక్కువ ప్రమాదం అని ఈ అధ్యయనం సూచించింది. దీర్ఘకాలిక కెఫిన్ ప్రభావంలో బాడీ మాస్ ఇండెక్స్ (BMI) దాదాపు సగం తగ్గినట్లు వెల్లడైంది. కెఫిన్ తీసుకోవడం వల్ల బరువు, కొవ్వు స్థాయి తగ్గుతుందని చిన్న, స్వల్పకాలిక ట్రయల్స్‌లలో రుజువైనట్లు కూడా అధ్యయనం పేర్కొంది. అయితే దీర్ఘకాలిక ప్రభావాల గురించి మాత్రం అధ్యయనం నిర్వహించలేదు.

యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లోని వార్విక్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ స్టీఫెన్ లారెన్స్, మెడ్‌స్కేప్ నివేదిక ప్రకారం.. కెఫిన్ వినియోగం పెరిగిన కొలెస్ర్టాల్‌ను బర్న్ చేస్తుంది. అధిక బరువు తగ్గిస్తుంది, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది.

Also Read..

సామాన్యులకు షాకింగ్ న్యూస్.. పెరిగిన పాల ధర

Advertisement

Next Story