- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health tips : బ్రేక్ ఫాస్ట్‌ను మిస్ చేస్తున్నారా.. బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడొచ్చు !!
దిశ, ఫీచర్స్ : ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వలనో, చలికి ఆకలి వేయడం లేదనో బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తున్నారా? అప్పుడప్పుడైతే ఏమో కానీ.. కొంతకాలం అదే కంటిన్యూ అయితే మాత్రం మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే శరీరానికి తగిన పోషకాలు అందవు. పైగా టిఫిన్ చేయకుండానే ఇంటి పనులు చేసుకోవడం, ఆఫీసుకు వెళ్లడం వంటివి తరచుగా కొనసాగితే కోపం, చికాకు వంటివి పెరుగుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంవల్ల మెదడు కణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో ఏకాగ్రతను కోల్పోతారని, చేసే పనిలో ప్రొడక్టివిటీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం దీర్ఘకాలంపాటు కొనసాగితే.. నిద్రలేమి, మైగ్రేన్ వంటి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయని న్యూరాలజీ అండ్ వెల్‌నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా పరిశోధకులు అంటున్నారు. దీంతో బ్రెయిన్ యాక్టివిటీస్‌లో ప్రతికూల మార్పులు వస్తాయి. ఫలితంగా జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాత్ర లోపించడం, మానసిక ఆందోళన వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అందుకే తగిన పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ చేయడం, క్వాలిటీ స్లీప్ ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమనాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More ...
Health : కాళ్లు, చేతులు మాత్రమే చల్లబడి, శరీరం వేడిగా ఉంటోందా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!