- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఉల్లి, ఆలు ధరలు..!
దిశ, ఫీచర్స్: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే విషయం మన అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు ఉల్లి ధర కన్నీళ్లు తెప్పిస్తోంది. వారం రోజుల్లో దాదాపు రెట్టింపు అయ్యింది దీని ధర. హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర ఎక్కువగా ఉండడంతో రిటైల్ మార్కెట్‌లోనూ ధర పలుకుతోంది. కిలో ఉల్లి ధర రూ.40 నుంచి 50 వరకు రిటైల్ మార్కెట్‌లో పలుకుతోంది. వారం క్రితం వరకు కిలో రూ.20-25 కి లభించేది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఉల్లి రాక తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఉల్లి ధర పెరిగింది. ఉల్లి మాత్రమే కాదు బంగాళదుంపలు కూడా ఖరీదయ్యాయి. రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.35 నుంచి 45 వరకు లభిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి, బంగాళదుంపల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి:
గత వారం రోజుల్లో హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర దాదాపు రెట్టింపు అయింది. వారం రోజుల క్రితం క్వింటాల్‌కు రూ.1200 నుంచి రూ.1300 పలికిన ధర ఇప్పుడు క్వింటాల్‌కు రూ.2000 నుంచి రూ.2400 వరకు పెరిగింది.
బంగాళదుంపలు కూడా ఖరీదయ్యాయి:
ఉల్లి ధర మాత్రమే కాదు.. బంగాళదుంప ధర కూడా పెరిగింది. రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.35 నుంచి 45 వరకు లభిస్తోంది. విపరీతమైన వేడి కారణంగా బంగాళదుంప ఉత్పత్తి తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు వర్షం కూడా బంగాళదుంపల ధరలు పెంచింది. రానున్న కాలంలో బంగాళదుంపల ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు.
ధరలు పెరగడానికి కారణాలివే:
వర్షాకాలం ఇప్పుడే మొదలైంది. ఇది ఉల్లి, బంగాళాదుంపల దిగుబడిపై ప్రభావం చూపుతుంది. దిగుబడి తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు ఉల్లి, బంగాళదుంపలను మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ కారణంగానే ఉల్లి, బంగాళదుంపలు కూడా వినియోగదారులకు ఖరీదుగా మారుతున్నాయి.
ప్రభుత్వం కొన్ని షరతులతో ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ఉల్లి వ్యాపారులు విదేశాలకు ఉల్లిని పంపేందుకు మార్గం సుగమమైంది. ఇలా చేయడం వల్ల దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ఉల్లి ధర పెరుగుతుంది.
రానున్న రోజుల్లో ధరలపై ఎలాంటి ప్రభావం చూపనుంది:
ఉల్లి, బంగాళదుంపల ధరలు రానున్న రోజుల్లో మెరుగుపడేలా లేవు. వాటి ధర మరింత పెరగనుంది. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండికి చెందిన ఉల్లి వ్యాపారి దేవేష్ సైనీ ప్రకారం.. రాబోయే కాలంలో ఉత్తర భారత దేశంలో వర్షపాతం మరింత పెరుగుతుంది. దీంతో ఉల్లి ధర మరింత పెరుగుతుంది. ఈసారి ఉల్లి కిలో రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతుందని చెప్పారు.
దీంతో రాబోయే కాలంలో ఉల్లి గడ్డలు, ఆలు కొనాలంటే సామాన్యులు, పేద, మధ్య తరగతి కుటుంబాలు వీటిని కొనాలంటే జంకాల్సిన పరిస్థితి రాబోతుంది.