బిగ్ షాక్.. సరిగ్గా బ్రష్ చెయ్యకపోతే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం!

by sudharani |
బిగ్ షాక్.. సరిగ్గా బ్రష్ చెయ్యకపోతే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం!
X

దిశ, ఫీచర్స్: బ్రేషింగ్ అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యం. మన రోజు స్టార్ట్ అయ్యేది బ్రషతోనే. రోజు పొద్దుటే పళ్లు తోముకోవడం వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. నోటికి సంబంధించిన ఎన్నో ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షణ కలుగుతోంది. అయితే.. కొంత మంది బ్రషింగ్‌ను చాలా ఈజీగా తీసుకుంటారు. మరికొందరు అయితే పళ్లు తోమడం మానేస్తారు. అయితే.. బ్రష్ చెయ్యడం మానేసిన.. సరిగ్గా చెయ్యపోయిన దాని వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసా? సరిగ్గా బ్రష్ చేయడకపోవడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తాజా పరిశోధనలో తేలింది.

బ్రష్ చేసుకోకపోతే నోట్లో సూక్ష్మజీవులు పెరిగిపోతాయి. అయితే.. ఈ సూక్ష్మజీవులు క్యాన్సర్‌కు కారణం అవుతాయని అమెరికాలోని ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ సెంటర్ పిశోధకులు గుర్తించారట. ఈ పరిశోధన ప్రకారం.. నోటిలో ఉద్భవించే సూక్ష్మజీవులు నోటీ ద్వారం ద్వార కిందకు వెళ్లి కడుపు ఆమ్లాలపై ప్రభావితం చేయగలవట. దీనికి నిరూపించడం కోసం 200 ప్రేగు క్యాన్సర్ కేసులను అంచనా వేశారు పరిశోధకులు. ఇక కణితులలో సగం సూక్ష్మజీవులను కలిగి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

అయితే.. నోటీలో ఉద్భవించే సూక్ష్మజీవులు కడుపులోకి వెళ్లడం వల్ల ఇవి కాలక్రమేణా ప్రాణాంతకంగా మారుతాయట. ఈ క్రమంలోనే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. ఇక నోటిలో క్రిములు ఉండటం సర్వ సాధారణం అయినప్పటికీ.. సరిగ్గా బ్రషింగ్ చెయ్యకపోతే అవి మరింత పెరిగి పెద్ధప్రేగు క్యాన్సర్‌కు దారి తీస్తాయట. కాబట్టి చిన్న పిల్లలకు సైతం బ్రషింగ్‌పై అవగాహనం కల్పించడం పేరెంట్స్ ప్రధాన లక్ష్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement

Next Story