Mustard Oil: ఆవనూనెతో వండిన ఆహారం తింటే ఎన్ని అద్భుతాలో తెలుసా?

by Anjali |
Mustard Oil: ఆవనూనెతో వండిన ఆహారం తింటే ఎన్ని అద్భుతాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా జనాలు వంటకాల్లో గోల్డ్ డ్రాప్, సన్‌ఫ్లవర్ ఆయిల్, పల్లీనూనె వంటివి వాడుతుంటారు. ఈ నూనెలు మార్కెట్‌లోకి వచ్చాక.. పూర్వంలో ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఆవ నూనెను వాడే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అప్పట్లో ఉత్తర భారతదేశంలో ఎకరాలకు ఎకరాలు ఆవాలను పండించేవారట. పురాతన వైద్యం లో ఆవాలకు ఎంతో విలువనిచ్చేవారట. అయితే రైస్ బ్రాన్ ఆయిల్, సన్ ఫ్లవర్, గోల్డ్ డ్రాప్ ఆయిల్‌ను వంటకాల్లో ఏ విధంగా వినియోగిస్తాన్నామో ఆవ నూనె కూడా మీ వంటకాల్లో ప్రతి రోజూ వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తాజాగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆవాల్లో నుంచి తీసేదే ఆవనూనె. కాగా ఆవాల్లో ఉన్న పోషకాలన్నీ ఈ నూనెలో లభిస్తాయి.

ఆవనూనె ప్రయోజనాలు..

ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఆవాలు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.హెయిర్ ఫాల్ సమస్యలను తొలగిస్తుంది. ప్రతి రోజూ ఆవనూనెను వాడితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీనిలో సెలీనియం అధికంగా ఉంటుంది కాబట్టి.. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారు, పొట్ట తో ఇబ్బంది పడుతోన్న వారికి బెస్ట్ ఆయిల్‌గా చెప్పుకోవచ్చు. ఆవ నూనె శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించడమే కాకుండా కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఎంతగానో మేలు చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed