- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Belly fat : ప్రతి రోజూ ఉదయం ఈ వాటర్ తాగితే చాలు.. బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గించుకోవచ్చు!
దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. పొట్ట పెరగడం పలు ఇతర సమస్యలతో కూడా ముడిపడి ఉంటోంది. రోజువారి కార్యకలాపాలకే కాకుండా వివిధ వ్యాధులకు కూడా దారితీస్తుంది. జీవన శైలిలో మార్పులు, తప్పుడు ఆహారపు అలవాట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే కొన్ని రకాల చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం.
* లవంగం వాటర్ : లవంగాల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఆకలిని తగ్గించి, జీవ క్రియను మెరుగు పరిచే పోషకాలు కూడా ఫుల్లుగా ఉంటాయి. కాబట్టి డైలీ ఉదయం లవంగం వాటర్ తాగితే మంచిదని, అలాగే పొట్ట కొవ్వును కరిగించడంలో ఇది సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ నీటిని తయారు చేయడానికి ఒక గ్లాసు నీటిలో 3 నుంచి 4 లవంగాలను నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి ఉదయం రెండు నిమిషాల పాటు ఆ నీటిని మరిగించి తాగాలి.
* అల్లం నీరు: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అల్లంలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అల్లం వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిది. అధిక బరువు, మలబద్దకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కొంచెం అల్లం తీసుకొని ఒక గ్లాస్ వాటర్‌లో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి ఉదయం 5 నిమిషాల పాటు ఆ నీటిని వేడిచేసి చల్లారాక తాగాలి.
* మెంతి వాటర్ : ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేవాటిలో మెంతులు ఒకటి. పైగా రోజూ మెంతుల వాటర్ తాగడంవల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా చేస్తుంది. అధిక బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నాటిని 5 నిమిషాలు మరిగించి తాగాలి. క్రమంగా ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.
* చియా గింజల వాటర్ : చియా సీడ్స్‌లో కరిగే గుణం కలిగిన ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలు నానబెట్టిన వాటర్‌ను తాగడం ఆరోగ్యానికి మంచిది. అధిక బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.
* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.