గర్భిణులు క్యారెట్ తింటే కడుపులో నవ్వుతున్న శిశువులు..

by Hamsa |   ( Updated:2022-09-23 12:28:29.0  )
గర్భిణులు క్యారెట్ తింటే కడుపులో నవ్వుతున్న శిశువులు..
X

దిశ, ఫీచర్స్ : పిండం దశలో ఉన్న శిశువులు తమ తల్లి కాలే(ఆకు కూరలు) తిన్నపుడు గర్భంలో ఎక్కువగా 'కేకలు' వేస్తారని, అదే క్యారెట్లు తిన్నపుడు మాత్రం మరింత 'నవ్వు-ముఖం' కలిగి ఉంటారని తాజా అధ్యయనం వెల్లడించింది. వివిధ రుచులను పసిగట్టడంతో పాటు అయిష్టతను చూపడంలో గర్భస్థ శిశువుల సామర్థ్యాలకు సంబంధించిన ప్రారంభ సాక్ష్యాలను అర్థం చేసుకోవడంలో ఈ అధ్యయనం పలు విషయాలను కనుగొన్నదని పరిశోధకులు తెలిపారు.

ఇంగ్లాండ్‌లో సుమారు 100 మంది మహిళల ఆరోగ్యకరమైన పిండాలను పరిశీలించారు సైంటిస్టులు. ఈ క్రమంలో తల్లులకు పొడిరూపంలో రెండు రకాల ఆహారాలు కలిగిన క్యాప్సూల్స్ ఇచ్చారు. ఈ మేరకు 35 మంది మహిళలను ఆర్గానిక్ కాలే క్యాప్సూల్‌ వినియోగించిన గ్రూప్‌లో, మరో 35 మందిని క్యారెట్ క్యాప్సూల్స్‌ వాడిన గ్రూప్‌లో, మిగతా 30 మందిని డ్రై ఫుడ్‌కు దూరంగా ఉంచారు. దాదాపు 20 నిమిషాల తర్వాత, 4D అల్ట్రాసౌండ్ స్కాన్స్‌లో కాలేకి గురైన చాలా మంది పిండస్థ శిశువుల ముఖంలో మొహమాటం వంటి లక్షణాలు గుర్తించామని, ఇక క్యారెట్‌ ప్రభావమున్న వారు చాలా వరకు నవ్వినట్లు కనిపించారని పరిశోధకులు తెలిపారు.

అయితే, పిండాలు పరిపక్వం చెందడంతో రుచులకు ముఖ ప్రతిస్పందనలు మరింత క్లిష్టంగా మారినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఫలితాల ఆధారంగా.. గర్భంలో కొన్ని రుచులకు పదేపదే బహిర్గతం కావడమనేది పుట్టిన తర్వాత పలు ఆహార ప్రాధాన్యతల ఎంపికకు ఒక కారకంగా ఉండవచ్చు. పిండం గర్భంలో ఉన్నప్పుడు కాలే వంటి కూరగాయలకు మామూలుగా బహిర్గతమైతే.. వారు తర్వాత తమ జీవితంలో తట్టుకోగల లేదా ఆనందించే అవకాశం ఉందని రీసెర్చర్స్ విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ, పిండాలు భావోద్వేగాలు, ఇష్టాయిష్టాలను అనుభవించగలవో లేదో ఖచ్చితంగా నిర్ధారించడానికి తదుపరి పరిశోధన అవసరమని అధ్యయన రచయితలు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed