- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాయామం చేసే సమయం లేదా?.. రోజూ చప్పట్లు కొట్టినా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు !
దిశ, ఫీచర్స్ : మనం సాధారణంగా మీటింగ్స్‌లోనో, ఆయా సందర్భాల్లో ఎవరినైనా అభినందించడానికో చప్పట్లు కొట్టడాన్ని చూస్తుంటాం. నిజానికి క్లాప్స్ కొట్టాలన్న ఆలోచన సంతోషంలో నుంచి పుట్టుకొస్తుంది. అయితే ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా రోజూ 1500 సార్లు ఒక వ్యాయామం లాగా చప్పట్లు కొట్టడంవల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం..
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
చప్పట్లు కొట్టడానికి మనం రెండు చేతులను ఒకేసారి ఉపయోగిస్తాం కాబట్టి, కండరాల కదలికల్లో సానుకూల మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని రక్తనాళాలు ప్రేరేపించబడతాయి. దీనివల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగడంవల్ల ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే చప్పట్లు కొట్టడం ఒక ఔషధంలా పని చేస్తుందట. చేతుల ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి నరాలను ప్రేరేపించడంతోపాటు మెదడుకు సంకేతాలను పంపుతుంది. దీని కారణంగా మానసిక వికాసం కలుగుతుంది. శరీర అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి.
ఆందోళన తగ్గుతుంది
ఆందోళనను, అతి ఆలోచనలను తగ్గించడంలో చప్పట్లు కొట్టడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. శారీరక కదలికల్లో వివిధ సందర్భాల్లో అడ్రినలిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఇవి కొన్నిసార్లు టెన్షన్, కోపం, ఆందోళన వంటి చర్యలను ప్రేరేపిస్తుంటాయి. పైగా ఈ అడ్రినలిన్ హార్మోన్లు రక్త నాళాలను ఉత్తేజితం కాకుండా అడ్డుకుంటాయి. చప్పట్లు కొట్టడంవల్ల బ్రెయిన్‌కు సంకేతాలు అలర్ట్‌నెస్ సిగ్నల్స్ అందుతాయి. దీని కారణంగా ఆందోళన, కోపం కలిగించే అడ్రినల్ హార్మోన్లు రిలీజ్ కాకుండా, సంతోషానికి కారణం అయ్యే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది.
కీళ్ల నొప్పులకు మంచి మెడిసిన్
ఆర్థరైటిస్ వ్యాధి, శరీరంలోని వివిధ కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు కొద్దిసేపు చప్పట్లు కొడితే తగ్గిపోతాయని నిపుణులు చెప్తున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, హైబీపీ, తలనొప్పి, నిద్రలేమి, కళ్లు మసకబారడం వంటి అనారోగ్య సమస్యలు, రుగ్మతలు కూడా చప్పట్లు కొట్టడంవల్ల తగ్గుతాయట. అందుకే రోజూ ఉదయాన్నే కనీసం 15 వందలసార్లు చప్పట్లు కొడితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆయుర్వేదిక్ నిపుణులు పేర్కొంటున్నారు.
Read More..
వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా? .. మీరు చేసే పొరపాట్లు ఇవే..