- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలు పుట్టాలంటే ఈ నిమ్మకాయతో ట్రై చేయాల్సిందే.. కానీ ధర తెలిస్తే షాక్ అవుతారు!
దిశ, ఫీచర్స్: ఈరోజుల్లో చాలా మందిని వంధ్యత్వ సమస్య వెంటాడుతోంది. వంధ్యత్వం అనేది గర్భాన్ని పొందకుండా నిరోధించే ఏదైనా ఆరోగ్య సమస్య అని అర్థం. కొంత మందిలో ఇది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లలు పుట్టుకుండా ఉంటారు.. లేకుంటే ఎన్నిసార్లు గర్భం దాల్చిన అది నిలవకుండా గర్భస్రావం అవుతుంది. ఇలా చాలా మందికి పెళ్లై ఏళ్లు గడుస్తున్న పిల్లలు మాత్రం పుట్టరు. ఈ క్రమంలోనే చాలా మంది ఎన్నో డబ్బులు పోసి మందులు వాడతారు. మరి కొందరు మాత్రం మూఢ నమ్మకాలకు పోయి కొన్ని చిత్రవిచిత్ర పనులు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. పిల్లలు కలగడం కోసం ఒక నిమ్మకాయను ఏకంగా రూ. 50, 500 లకు కొనుగోలు చేశారు ఓ జంట. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో మురుగ స్వామి ఆలయం ఉంది. అక్కడ నిర్వాహకులు వార్షిక పంగుని ఉతిరమ్ పండుగను నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఆలయ ఉత్సవాల్లో ప్రతి రోజు పూజారులు దేవుడి బల్లెంపై ఒక నిమ్మకాయను పెడతారు. అయితే.. ఆ దేవుడిని చాలా శక్తివంతంగా పూజిస్తారు. ఈ క్రమంలోనే ఉత్సవాల్లో తొమ్మిది రోజులు బల్లానికి పెట్టిన నిమ్మకాయలకు అధిక శక్తులు ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అంతే కాకుండా మొదటి రోజు బల్లానికి పెట్టిన నిమ్మకాయ అన్నింటికంటే శక్తివంతమైనదని వాళ్ల నమ్మకం. ఇక ఈ 9 రోజుల ఉత్సవం పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయలను వేలం పాట పెడతారు.
మొదటి నిమ్మకాయ శక్తివంతమైనది నమ్మన ఓ జంట ఆ మొదటి నిమ్మకాయను రూ. 50, 500 లకు కొనుగోలు చేశారు. ఇలా మొత్తం 9 నిమ్మకాయలు వేలం పెట్టగా.. రూ. 2.36 లక్షలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఆ ఆలయంలో దేవుడి పవిత్రమైన బల్లెముపై మొలిచిన ఈ సిట్రస్ పండ్లను తినడం వల్ల వంధ్యత్వం నయం అవుతుందని అక్కడి భక్తులు నమ్మకమట. ఇక కేవలం బిడ్డను కనాలని చూస్తున్న వారు మాత్రమే కాదు, వ్యాపారవేత్తలు, వ్యాపారులు కూడా ఈ నిమ్మకాయల కోసం పోటీ పడుతుంటారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కాగా.. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్ కావడంతో.. జ్యోతిష్యం, దేవుడు ఇలాంటివి నమ్మని వాళ్లు మాత్రం ఇది మూఢనమ్మకం అంటూ కొట్టిపడేస్తున్నారు.