- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పంటి నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ నూనె రాస్తే పెయిన్ ఇట్టే మాయమవుతుంది..!
దిశ, ఫీచర్స్: పంటి నొప్పితో ఆగకుండా బాధపడేవారు చాలా మందే ఉంటారు.. పంటి నొప్పి వచ్చినప్పుడు పెయిన్ రిలీవర్ మాత్రలు వేసుకుంటారు. అయితే దీనివల్ల మరింత ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పంటి నొప్పి మొదలైతే తలనొప్పి కూడా వస్తుంది. అది అనుభవించిన వారికే తెలుసు. పంటి నొప్పి మొదలైతే చేసే పనిపై ఏకాగ్రత ఉండదు.. అయితే ఈ పంటినొప్పిని హోం రెమెడీస్‌తో సులభంగా నయం చేసుకోవచ్చు. వంటగదిలో లభించే పదార్థాలను ఉపయోగించే మందులు తయారు చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
లవంగాలు:
మన వంటగదిలోని పదార్థాలు మన వ్యాధులన్నిటినీ నయం చేస్తాయని అంటారు. అదేవిధంగా మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులలో ఒకటైన లవంగాలు పంటి నొప్పిని దూరం చేస్తాయి. పంటి నొప్పి సమస్యకు లవంగం నూనె చాలా మంచిది. లవంగం నూనె పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఎందుకంటే లవంగం నూనెలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పంటి నొప్పి, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. అంతేకాకుండా, లవంగం నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది పంటి నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
నూనె తయారీ విధానం:
దీని కోసం సరిపడా లవంగాలను తీసుకుని బాగా గ్రైండ్ చేసి గాజు పాత్రలో వేసి సరిపడా ఆలివ్ ఆయిల్ పోసి మూత పెట్టాలి. తర్వాత సూర్యరశ్మి తగిలేల ఒక వారం లేదా రెండు రోజులు ఉంచి, వడపోసి ఆ లవంగం నూనెను మరో గాజు పాత్రలో పోసి వాడండి.. నొప్పి ఉన్న చోట నూనె రాసుకుంటే పంటి నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఇలా చేస్తే పంటి నొప్పికి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.