- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..?
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చర్మ సమస్యలు సర్వసాధారణం. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో, ఫంగల్ ఇన్ఫెక్షన్లు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు చర్మ సమస్యలతో పోరాడుతున్నట్లయితే, ఈ చిట్కాల గురించి తెలుసుకోండి.
ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నట్లయితే, ఈ ఇంటి చిట్కాలను ట్రై చేయండి. ముందుగా కొబ్బరినూనెను తీసుకోండి. ఇది యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ముందుగా ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశాన్ని దూదితో క్లీన్ చేసి, 5 నిముషాల తర్వాత కొబ్బరి నూనెను మీ చేతులకు అప్లై చేసి, అలర్జీ ఉన్న చోట మసాజ్ చేయండి. ఇలా మీరు రోజుకు 2 నుంచి 3 సార్లు చేయవచ్చు.
ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా బాగా పనిచేస్తాయి. రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్‌ను అప్లై చేసి, 10 నుంచి 12 నిమిషాలు పాటు ఉంచి శుభ్రం చేయండి.