- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా? రూ. 10 కోసం ఆలోచిస్తే హెల్త్ పరంగా నష్టపోతారంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్: మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీపీఎల్ కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడం కోసం చాలా తక్కువ ధరకు ప్రతి నెల రేషన్ బియ్యాన్ని అందిస్తోన్న విషయం తెలిసింది. ఎంతో మంది ఈ బియ్యాన్ని తీసుకుంటారు. కానీ వండరు. ఈ రైస్ వండితే అన్నం మెత్తగా అవుతుందని, పురుగులుంటాయని చాలా మంది ఈ బియ్యాన్ని వండటానికి ఇష్టపడరు.
అలాంటి వారికి తాజాగా నిపుణులు ఈ బియ్యం ప్రయోజనాలు వెల్లడించారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు అందించే ఫోర్టిఫైడ్ రైస్ లో ఎన్నో పోషకాలు ఉంటాయని ఇటీవలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపింది. ఈ బియ్యంలో ‘అదనంగా జింక్, విటమిన్ A, థయమిన్, రైబోప్లావిన్, నియాసిన్, విటమిన్ B6 పోషకాలు కలుపుతారు. ఇలా ప్రాసెస్ చేసిన రేషన్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్తహీనత సమస్యను అదిగమించవచ్చు.
చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది’. చాలా మంది ఇన్ని ప్రయోజనాలున్న రేషన్ బియ్యాన్ని వండుకోకుండా కేజీకి 10 రూపాయల చొప్పున బయట అమ్ముకుంటుంటారు. పది రూపాయల కోసం ఆలోచిస్తే ఆరోగ్యపరంగా నష్టపోవాల్సి వస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. పోషక విలువలను పెంచేందుకే ఆహారానికి కృత్రిమ విటమిన్లు కలిపి బలవర్ధకం చేయడాన్ని ఫోర్టిఫైడ్ అంటారు.
ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి.. దానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి-12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి ఆ పిండిని తిరిగి బియ్యం రూపంలో మార్చుతారు. ప్రతి 99 కిలోల రేషన్ బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కెన్నెల్స్ మిక్స్ చేస్తారు. అనంతరం ఈ రైస్ ను సంచుల్లో నింపి వాటిని ఎఫ్‌సీఐ గోడౌన్‌లలో భద్రపరుస్తారు. తర్వాత రేషన్ దుకాణాలకు తరలిస్తారు.