Minister Achchennaidu:రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ

by Jakkula Mamatha |
Minister Achchennaidu:రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు  జమ
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(AP Agriculture Minister Achchennaidu) ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి నిబంధనల అడ్డు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని మంత్రి తెలిపారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. రైతుల నుంచి ప్రతి గింజ కొంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

పామాయిల్ రైతులు(Palm oil farmers), కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్‌ఫెడ్(Oilfed), ఉద్యాన శాఖ అధికారుల(Horticulture Department officials)తో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణపై చర్చించారు. పామాయిల్‌ ధరలపై సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పామాయిల్ రైతులకు ఊరట లభించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలకే టన్ను ధర రూ.12,500 నుంచి ఏకంగా రూ.19,000కి ధర పెరిగింది అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed