- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Karnataka: తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను నిరూపించండి: కేంద్ర మంత్రికి సీఎం సిద్ధరామయ్య సవాల్
దిశ, నేషనల్ బ్యూరో: తమ ప్రభుత్వంపై అవినీతి, మంత్రులు కమీషన్‌లు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం జేడీ(ఎస్) నేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. సరైన పత్రాలు, రుజువులు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వంలోని మంత్రులు 60 శాతం కమిషన్లు తీసుకుంటున్నారు, అవినీతి జరుగుతున్నట్టు కుమారస్వామి ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి రుజువులు ఇవ్వమని అడుగుతున్నాను. కేవలం ఆరోపణలు చేయడం సరికాదు, సాక్ష్యాలు చూపించాలన్నారు. ఆరోపణలు చేయడమే ప్రతిపక్షాల పని కాదని, ఆధారాలు, పత్రాలతో నిరూపించాలని అన్నారు. ఇదే సమయంలో కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపునకు సంబంధించి స్పందించిన సిద్ధరామయ్య.. గత ప్రభుత్వం హయాంలోనూ ఛార్జీలు పెంచారు. ఉద్యోగుల జీతాలు, డీజిల్ ధర, కొత్త బస్సుల కొనుగోలు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పెంచామని తెలిపారు. చాలాకాలంగా ఛార్జీలు పెంచాలనే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకున్నాం. బీజేపీ అధికారంలో ఉండగా బస్సు ఛార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు. కాగా, ఆదివారం ఉదయం మైసూరులో విలేకరులతో మాట్లాడిన హెచ్‌డీ కుమారస్వామి.. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిమయమైందని, కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.