- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
దిశ, నేషనల్ బ్యూరో: రూ. 21 కోట్ల విలువైన కొకైన్‌ను దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ విభాగం అధికారులు ఆదివారం తెలిపారు. నిందితులు సావో పాలో నుంచి పారిస్ మీదుగా భారత్‌కు వచ్చారు. తనిఖీల్లో భాగంగా వారిద్దరినీ అధికారులు పట్టుకున్నారు. విచారణ తర్వాత ఇద్దరూ తాము కొన్ని మత్తు పదార్థాలతో కూడిన క్యాప్సూల్స్ తీసుకున్నట్లు అంగీకరించారని కస్టమ్స్ విభాగంలో అధికారిక ప్రకటనలో తెలిపింది. నిందితులను క్యాప్సూల్స్ తీసేందుకు అవసరమైన చర్యల స్థానిక సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా క్యాప్సుల్స్ తొలగించే ప్రక్రియ అనంతరం ఒక వ్యక్తి నుంచి 105 క్యాప్సుల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి నుంచి 937 గ్రాముల కొకైన్‌లు తీశారు. మరో మహిళా బ్రెజీలియన్ నుంచి 562 గ్రాముల కొకైన్ ఉన్న 58 క్యాప్సుల్స్‌ను వైద్యులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 1,399 గ్రాముల మాదక ద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు రూ.20.98 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.