- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Geysers : చలి కాలంలో గీజర్ వాడే వారికి అలర్ట్.. ఈ పొరపాట్లు చేస్తే ప్రమాదంలో పడ్డట్లే!
దిశ, ఫీచర్స్ : అసలే చలికాలం.. క్రమంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. దీంతో చాలా మంది ఉదయంపూట వేడినీళ్లతోనే స్నానం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకోసం వాటర్ హీటర్లు, గీజర్లు వాడుతున్నారు. అయితే వీటిని సక్రమంగా వాడకపోతే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన కేర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
* కొంతమంది వేడి నీటితో స్నానం చేసేందుకుకని ముందుగానే గీజర్ ఆన్ చేసి, స్నానం చేశాక కూడా ఎక్కువసేపు అలాగే వదిలేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. దీంతో గీజర్ చాలా హీట్ ఎక్కుతుంది. దాని ఎఫెక్ట్ వల్ల గీజర్‌కు కనెక్ట్ అయి ఉన్న ఎలక్ట్రికల్ వైర్లు కూడా వేడెక్కి సమస్యలు తలెత్తవచ్చు. కొన్నిసార్లు గీజర్ పేలిపోవచ్చు. కాబట్టి స్నానం చేయగానే వెంటనే ఆఫ్ చేయాలి.
*ఏ వస్తువైనా కొంతకాలానికి రిపేరుకు వస్తుంది. గీజర్ అందుకు అతీతం కాదు. కాబట్టి ఆర్నెల్లకో, ఏడాదికో చెక్ చేస్తూ ఉండాలి. ఏడాదికోసారి సర్వీస్ చేయించాలి. అలాగే గీజర్‌కు కనెక్ట్ చేసి ఉండే వైర్లు పాడైపోతే గనుక వెంటనే మార్చాలి. వాల్వ్స్‌లో లీకేజీలు లేకుండా చూసుకోవాలి. అయితే ఇవన్నీ మీరు సొంతంగా చేయడం రిస్క్‌తో కూడిన పని, కాబట్టి ఎలక్ట్రీషియన్ ద్వారా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
*పాత గీజర్‌లోని వివిధ పార్ట్స్ పాడైపోయి ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడూ చెక్ చేయించాలి. అలాగే ట్యాంక్‌లో నీళ్లు లేప్పుడు గీజర్ ఆన్ చేస్తే పాడైపోవచ్చు. ఇంట్లో గీజర్ ఆన్ చేసి ఉన్నప్పుడు ఎక్కువ పవర్ తీసుకునే ఇతర పరికరాలను కూడా వాడకూడదు. దీనివల్ల గీజర్ సిస్టమ్‌పై ఒత్తిడి పెరిగి త్వరగా పాడయ్యే చాన్స్ ఉంటుంది. హీటింగ్ ఎలిమెంట్ అరిగిపోయినా దానిపై మినరల్స్ పేరుకుపోయినా వెంటనే మార్చడం బెటర్.
*గీజర్ ప్రెజర్ ఎక్కువ స్థాయిలో ఉంటే ప్రమాదాలు జరిగే చాన్స్ ఉంటుంది. అందుకే ఆటోమేటిక్‌గా ప్రెజర్ రిలీజ్ చేసే సేఫ్టీ వాల్వ్ ఇన్‌స్టాల్ చేయించడం ఉత్తమం. అలాగే విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు సంభవిస్తుంటే గీజర్ ఆఫ్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక దుమ్ము, ధూళి, తేమ వంటి వాటి నుంచి రక్షణకోసం గీజర్‌పై కవర్ సెట్ చేయించడం మంచిది. తుప్పు పట్టినట్లు గమనిస్తే ఆ గీజర్‌ను వాడకపోవడమే బెటర్. ప్రస్తుతం స్పెషల్ ఫీచర్లు కలిగిన గీజర్లు మార్కెట్లో చాలానే లభిస్తు్న్నాయి. నీళ్లు వేడి కాగానే ఆటోమేటిగ్గా ఆఫ్ అయ్యే టైమర్ ఫీచర్ ఉన్న గీజర్‌ను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం