- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోస, వడ తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే ?
దిశ, ఫీచర్స్: మామూలుగా మనం ఉదయం ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటాము. దోస, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చాలా మంది అన్నం ఎక్కువగా తీసుకుంటారు. మరి కొంత మంది అన్నానికి బదులుగా రెండు పూటలా టిఫిన్స్ చేస్తుంటారు. అలా తినడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. కొందరైతే టీ, కాఫీ ల పైన ఆధారపడి ఉంటారు. దాని వలన ఆకలి మందగిస్తుంది. ఉదయం ఏమి తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయం లేవగానే బ్రెక్ ఫాస్ట్ లోకి ఇడ్లి , దోశ , వడ తింటుంటారు. వీటిని ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏమి కాదట. కానీ ప్రతిరోజు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు వెల్లడించారు. అలాగే ఎసిడిటి సమస్య కూడా ఎక్కువవుతుందట. కొందరు ఇడ్లీలోకి సాంబార్, అల్లం చట్ని వంటివి కలిపి తీసుకుంటారు. అలా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుందట. అలాగే బియ్యం కంటే మినపప్పులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇవి షుగర్ ను పెంచే అవకాశం ఉందట. అంతే కాకుండా ఇలా తినడం వలన పేగులు తమ జీర్ణ క్రియ శక్తిని కోల్పోతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. కీళ్ళ నొప్పులు, వాత వ్యాధులు వస్తాయి. మరి ఉదయం సమయంలో ఏం తినాలన్న విషయానికొస్తే.. ఉదయం సమయంలో పెరుగన్నం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి మిగిల్చిన అన్నాన్ని పోద్దున్నే పెరుగులో వేసుకుని తినడం వలన ఆరోగ్యం మంచిగా ఉంటుందట. పాత కాలంలో ఇలా తినడం వలనే అప్పటిలో ఉండే వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉండేవారు.