బీర్లతో.. తప్పదు బేజార్!

by Nagaya |
బీర్లతో.. తప్పదు బేజార్!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఆఫీస్‌ లేదా వర్క్ ప్లేస్‌లో రోజంతా టైట్ షెడ్యూల్ గడిపి, సాయంత్రానికి చల్లని బీరుతో సేదతీరడం ఈ రోజుల్లో కామన్ వ్యవహారం.నిజానికి ఆ టైమ్‌లో పొందే ఆనందాన్ని, స్ట్రెస్ రిలీఫ్‌ను మాటల్లో వర్ణించడం కష్టం. అయితే ఈ హ్యాపీనెస్ ఒక్క బీరుతో ఆగిపోతే ప్రమాదం లేదు. కానీ రెండు, మూడు, నాలుగు.. ఇలా సంఖ్య పెంచుకుంటూ పోతే.. ఇదే అలవాటును రెగ్యులర్‌గా కొనసాగిస్తే.. ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ క్రమంలో బాడీలో కనిపించే కొన్ని సూక్ష్మ సంకేతాలు ప్రతిరోజు మోతాదుకు మించి తాగుతున్నారన్న విషయాన్ని నిర్ధారించగలవు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా ఎంత తాగుతున్నారన్న విషయంపై ఓ అంచనాకు రావాలి. ఒకవేళ తీవ్రతరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదిలా ఉంటే.. ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి? ఇక్కడ తెలుసుకుందాం.

* కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ :

అతి మద్యపానం వల్ల జీర్ణాశయంలోని కణజాలం దెబ్బతింటుంది. దీనివల్ల ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో పోషకాలు, విటమిన్స్ గ్రహించడంలో ప్రేగులకు సమస్యలు ఏర్పడి క్రమంగా పోషకాహార లోపానికి దారితీస్తుంది. ఇక బీర్లు సేవించిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్‌ ట్రబుల్ అనుభవిస్తున్నట్లయితే మోతాదుకు మించి బీర్లు తీసుకుంటున్నట్లే. ఈ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఉబ్బరాన్ని తగ్గించవచ్చు. అంతేకాదు జీర్ణవ్యవస్థలో సంభవించే అల్సర్లు, హెమోరాయిడ్స్ వంటి భయంకరమైన ఆరోగ్య ప్రమాదాలను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

* బాత్‌రూమ్‌లో కష్టపడుతున్నారా?

ఆల్కహాల్ అతి సేవనం(బీర్‌తో సహా) వల్ల ఆహారం సరిగా జీర్ణవ్యవస్థలో అసౌకర్యం తలెత్తుతుంది. దీని మూలంగా మోషన్‌కు వెళ్లినపుడు ప్రత్యేకించి ప్రేగుల కదలికల సమయంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఇక మోతాదుకు మించి తాగడం వల్ల విరేచనాలు లేదా బాధాకరమైన ప్రేగు కదలికలు కూడా సంభవించవచ్చు. కాబట్టి బాత్‌రూమ్‌లో ఇబ్బంది పడుతున్నట్లయితే ఓసారి మీ డ్రింకింగ్ క్వాంటిటీని అంచనా వేసి, తగ్గించే ప్రయత్నం చేయండి. అంతేకాదు ఫ్రీ మోషన్ కోసం డైట్‌లో ఫైబర్-రిచ్ ఫుడ్స్ జోడించండి.

*ఆతృతగా ఉన్నారా?

ఆల్కహాల్ డిపెండెన్సీకి సంబంధించిన అనేక సంకేతాలు ఉన్నప్పటికీ, అతిగా ఆల్కహాల్ సేవించే వ్యక్తుల్లో 'ఆందోళన' అనేది కామన్ పాయింట్. లెక్కకు మించి బీర్లు తాగుతున్నట్లు అనిపిస్తే.. డిటాక్సిఫికేషన్ పీరియడ్‌లో ఆందోళన చెందే అవకాశం ఉంది. కాబట్టి సాధారణం కంటే ఎక్కువ ఆత్రుతగా ఉన్నట్లయితే ఎక్కువగా తాగడమే అందుకు కారణం కావచ్చు.

*నిద్రలేమి వేధిస్తుందా?

మితిమీరిన ఆల్కహాల్ వినియోగం కలత నిద్రకు కారణమవుతుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. ఒక వ్యక్తి డ్రింక్ చేసినపుడు అతడి శరీరం 'రీబౌండ్ ఎఫెక్ట్'ను అనుసరిస్తాయి. అంటే ఆల్కహాల్ శరీర వ్యవస్థను విడిచిపెట్టేందుకు నాలుగు లేదా ఐదు గంటల సమయం పడుతుంది. అంటే పడుకునే ముందు తాగితే, ఈ రీబౌండ్ ఎఫెక్ట్ నిద్రకు భంగం కలిగించవచ్చు. అందుకే నిద్రించేందుకు ఐదారు గంటల ముందే డ్రింక్ చేయడం ఉత్తమం. ఇక ప్రతిరోజు మంచి నిద్ర కోసం డైలీ కాకుండా అప్పుడప్పుడు ఒక బీర్‌ కంటే ఎక్కువ సేవించకపోవడం బెటర్.

* శృంగార జీవితం సాఫీగా సాగుతుందా?

రిలాక్సేషన్‌కు, బెడ్‌పై రెచ్చిపోయేందుకు ఆల్కహాల్ హెల్ప్ చేస్తుందని కొందరు చెప్పినప్పటికీ.. ఎక్కువగా తాగడం వల్ల లైంగికంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. అంతేకాదు ఎక్కువగా బీర్ తాగే పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అతి మద్యపానం సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తిని నిరోధించి లైంగిక కోరికలను తగ్గిస్తుంది. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఫేస్ చేస్తుంటే గనుక బీర్ల సేవనాన్ని తగ్గించే సమయం ఆసన్నమైనట్టే.

Advertisement

Next Story