మీ పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడుతున్నారా.. అయితే వారిలో ఈ మార్పులు రావడం ఖాయం!

by Jakkula Samataha |
మీ పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడుతున్నారా.. అయితే వారిలో ఈ మార్పులు రావడం ఖాయం!
X

దిశ, ఫీచర్స్ : పిల్లల మనసు చాలా సున్నితమైనది. వారు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో కూడా ఎవరికీ తెలియదు. అందుకే వారితో తల్లింద్రులు చాలా పద్ధతిగా, సరదగా ఉండాలి అంట. పిల్ల ముందు తల్లిదండ్రులు తిట్టుకోవడం, పోట్లాడుకోవడం అస్సలే చేయకూడదు. ఒక వేళ అలా చేస్తే అది వారి కెరీర్‌పై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు.

పిల్లల ముందు తల్లిదండ్రులు పోట్లాడుకోవడం వలన వారు మానసికంగా కుంగిపోతారంట. భార్యభర్తల గొడవలు వారి చిన్న మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు ఓ సర్వేలో వెళ్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లోని కొంత మంది పిల్లల పై అధ్యయనం చేయగా, ఇంట్లో తన తల్లిదండ్రులు ఎక్కువగా గొడవ పడే పిల్లల్లో ఒత్తిడి హర్మోన్ కార్టిసాల్ ఎక్కువగా ఉందని, వారు ఇతరులతో కలవకపోవడం, ఎక్కువ కోపానికి గురి కావడం లాంటి సమస్యలు వారిలో ఉన్నట్లు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.

  • తల్లిదండ్రులు తమ పిల్లల ముందు గొడవ పడటం వలన వారు తమ భవిష్యత్తుపై ఫోకస్ చేయలేరంట. నలుగురితో ఉండటానికి కూడా ఇష్టపడరంట, చెడు అలవాట్లు చేసుకోవడం, వారి ఆరోగ్యం పాడవడం వంటిది జరుగుతుందంట.

  • ఇంట్లో గొడవల వలన తమ బిడ్డల ఆరోగ్యం మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా క్షీణిస్తుందంట. వారు సరిగ్గా తినకపోవడం, నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలతో సతమతం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటున్నారు నిపుణులు.

  • పిల్లలు బడి నుంచి ఇంటికి రాగానే, ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటే, పిల్లవాడు బాగా ప్రాక్టీస్ చేస్తాడు. మంచి మానసిక స్థితిని కూడా అభివృద్ధి చేస్తాడు. రోజూ గొడవపడే తల్లిదండ్రులను చూసి పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుంటే, ఆ పిల్లవాడు మరే ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడు. పాఠశాల విద్య కూడా కుంటుపడుతుంది.
Advertisement

Next Story