పురాతన ఆలయం కింద కళ్లు చెదిరే అద్భుత ప్రపంచం.. పొడవైన సొరంగం కూడా..

by Javid Pasha |
పురాతన ఆలయం కింద కళ్లు చెదిరే అద్భుత ప్రపంచం.. పొడవైన సొరంగం కూడా..
X

దిశ, ఫీచర్స్ : ఈజిప్టుకు చెందిన ఆర్కియాలజిస్టులు ఆ దేశంలో ఒకప్పుడు టోలెమిక్ రాజ్యాన్ని పరిపాలించిన మహారాణి మరణం యొక్క మిస్టరీని ఛేదించడానికి చాలా రోజులుగా అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా రాణి క్లియోపాత్రా సమాధికోసం వేట ప్రారంభించారు. పురాతన చారిత్రాత్మక ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు సమాధిని ఇంకా కనుగొనలేదు కానీ ఈజిప్టు తీరంలో పురాతన శిధిలమైన నగరం టపోసిరిస్ మాగ్నాలోని ఒక దేవాలయం కింద జియోమెట్రిక్ ఆకారం కలిగిన ఒక అద్భుతమైన సొరంగాన్ని కనుగొన్నారు.

పురావస్తు శాస్త్రవేత్త, డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో యూనివర్సిటీకి చెందిన కాథ్లీన్ మార్టినెజ్ ఆధ్వర్యంలో ఆలయంలో తవ్వకాలు చేపట్టారు. కాగా శాస్త్రవేత్తల బృందం భూమికి 13 మీటర్లు (43 అడుగులు) దిగువన ఉన్న ఒక నిర్మాణాన్ని కనుగొన్నది. దానినే ‘జ్యామితీయ అద్భుతం(geometric miracle)’గా నిపుణులు పేర్కొంటున్నారు. 2 మీటర్ల పొడవైన ఈ సొరంగం నమ్మశక్యం కాని రీతిలో 1,305 మీటర్లు (4,281 అడుగులు) ఇసుకరాయితో నిండి ఉంది. ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తు మంత్రిత్వ శాఖ ప్రకారం దీని రూపకల్పన.. గ్రీకు ద్వీపం సమోస్‌లోని 6వ శతాబ్దపు అక్విడక్ట్ అయిన 1,036 మీటర్ల టన్నెల్ ఆఫ్ యుపాలినోస్‌ను పోలి ఉంటుంది. ఈజిప్టు చరిత్రకు సంబంధించిన అనేక రహస్యాలను ఛేదించడంలో ఈ సొరంగం తమకు అనేక విధాలా ఉపయోగపడుతుందని ఈజిప్టియన్ పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

Next Story